IPL Auction 2025 Live

Sunday Pooja: బీపీ, షుగర్ తో బాధపడుతున్నారా, వివాహ సంబంధాలు కుదరడం లేదా, అయితే 12 ఆదివారాలు ఈ పూజ చేస్తే సకల కష్టాలు తీరడం ఖాయం...

ఆదివారం నాడు ఉదయమే మేల్కొని తలారా స్నానం చేసి సూర్యునికి ఎదురుగా నిల్చుని సాష్టాంగ నమస్కారములతో సూర్యమంత్రాన్ని లేదా ఆదిత్యహృదయాన్ని మూడుసార్లు చదవాలి.

(Image: Twitter)

ఆదివారం నాడు సూర్యారాధన చేయాలి. అనారోగ్య నివారణకు, చర్మ, నేత్రవ్యాధుల నిర్మూలనకు, సంతాన క్షేమానికి, వైవాహిక జీవిత అనుకూలతకు  అందుకోసం ఆదివారం నాడు ఉపవాసం వుండి, సూర్యారాధన లేక సూర్యాష్టకం చేయడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు. ఈ వ్రతాన్ని శుక్లపక్ష ఆదివారం నాడు ప్రారంభించి, ఆ సంవత్సరంలో వచ్చే అన్ని ఆదివారాలు ఆచరించాలి. అలా ఆచరించలేని వారు కనీసం 12 వారాలైనా చేయాలి.

ఆదివారం నాడు ఉదయమే మేల్కొని తలారా స్నానం చేసి సూర్యునికి ఎదురుగా నిల్చుని సాష్టాంగ నమస్కారములతో సూర్యమంత్రాన్ని లేదా ఆదిత్యహృదయాన్ని మూడుసార్లు చదవాలి.

ఆ పైన గంగా జలాన్ని, లేదా శుద్దోదకాన్ని, ఎర్ర చందనాన్ని, దర్భలను సూర్యనారాయుణిడికి సమర్పించుకోవాలి. ప్రతి ఆదివారమూ ఉపవాసం వుంటే మంచిది. లేని పక్షంలో ఉద్యాపన చేసే రోజున మాత్రం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. పగలు పూజానంతరం ఎవరైనా దంపతులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి.