Shravana Masam: ఆగస్టు 17 నుంచి శ్రావణ మాసం ప్రారంభం, ఈ నెలలో ఈ తప్పులు చేస్తే లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురై దరిద్రం కాటేయడం ఖాయం..

ఈ మాసం వచ్చిందంటే హిందూ మతంలో పండగలు వచ్చినట్లే. ఈ నెల మొత్తం ఒక పవిత్రమైన మాసంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ధనలక్ష్మి దేవికి ఈ మాసం ఎంతో ఇష్టమైనది.

Goddess Lakshmi (File Photo)

జూలై 17 నుంచి శ్రావణమాసం ప్రారంభం కాబోతోంది. ఈ మాసం వచ్చిందంటే హిందూ మతంలో పండగలు వచ్చినట్లే. ఈ నెల మొత్తం ఒక పవిత్రమైన మాసంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ధనలక్ష్మి దేవికి ఈ మాసం ఎంతో ఇష్టమైనది. ఈ మాసంలో లక్ష్మీదేవి భూమిపైనే నివసిస్తుందని ఏ ఇంట్లో అయితే పవిత్రత ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఈ మాసం నివాసం ఉంటుందని, పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా శ్రావణమాసంలో వరలక్ష్మీదేవి వ్రతం ప్రతి ఇంట్లోనూ జరుపుకుంటారు ఈ వ్రతం జరుపుకున్న ఇంట్లో శుభం జరుగుతుందని ప్రతి ఒక్కరూ భావిస్తారు.  వరలక్ష్మి దేవి వ్రతం జరుపుకుంటారు అయితే శ్రావణమాసంలో నియమనిష్టలు పాటిస్తే లక్ష్మీదే నట్టింట్లో కొలువవుతుందని  పండితులు చెబుతున్నారు. 

 శ్రావణమాసంలో చేయకూడని తప్పులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మాంసాహారానికి దూరంగా ఉండండి:  శ్రావణమాసంలో వరలక్ష్మి దేవి వ్రతం చేసేవారు మాంసాహారానికి దూరం ఉంటే మంచిది.  ముఖ్యంగా శ్రావణమాసం ఎంతో పవిత్రమైనది ఈ మాసంలో వరలక్ష్మీదేవి ఆశీర్వాదం కావాలనుకునేవారు మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిది.

మద్యం స్వీకరించరాదు:  శ్రావణమాసంలో మద్యం స్వీకరించకపోవడం చాలా మంచిది.  ఏ ఇంట్లో అయితే మద్యం తాగిన వ్యక్తులు ఉంటారో ఆ ఇంటికి లక్ష్మీదేవి అడుగుపెట్టదు.  ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి కొలువుంటుంది అందుకే ఈ నెల రోజులు మద్యం, మాంసాలకు దూరంగా ఉంటే మంచిది.

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి,

శుచి శుభ్రత పాటించాలి: ఈ మాసం శుచి శుభ్రతకు మారుపేరు.  శ్రావణమాసంలో శుచి శుభ్రత పాటిస్తేనే లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువవుతుంది.  లేనిపక్షంలో లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అందుకే శ్రావణమాసంలో మీ ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోండి.

దానం చేయండి:  శ్రావణమాసంలో దానధర్మాలకు ఎంతో ప్రాశస్త్యం ఉంది.  ముఖ్యంగా పేద మహిళలకు వస్త్ర దానం చేస్తే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి ఆశీస్సులు కలుగుతాయి.  అలాగే కన్నె పిల్లలను  ఇంటికి ఆహ్వానించి వారికి భోజనం పెట్టడం ద్వారా శుభం జరుగుతుంది.