Ugadi నాడు ఈ పనులు తప్పక చేయాలని చెబుతున్న పండితులు, లక్ష్మీదేవీ అనుగ్రహం మీపై ఉండాలంటే ఈ నియమాలు పాటించాలని చెబుతున్న పురాణాలు
తెలుగువారు చాలా ఆనందంగా జరుపుకునే పండుగల్లో ఉగాది పండుగ ప్రముఖమైంది. ఈ సందర్భంగా ఉగాది పండుగ రోజున కొన్ని నియమాలు తప్పక పాటించాలని పురాణాలు చెబుతున్నాయి.
ఈ సృష్టి ఆరంభం అయిన కాలం యొక్క 'ఆది' ఉగాది అయ్యిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. తెలుగువారు చాలా ఆనందంగా జరుపుకునే పండుగల్లో ఉగాది పండుగ ప్రముఖమైంది. ఈ సందర్భంగా ఉగాది పండుగ రోజున కొన్ని నియమాలు తప్పక పాటించాలని పురాణాలు చెబుతున్నాయి.
ఉగాది పండుగ ఈరోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి అభ్యంగ స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. మన శరీరానికి, తలకు నువ్వులనూనె రాసుకుని, సున్నిపిండి పెట్టుకుని తైలాభ్యంగ స్నానం చేయాలి. అనంతరం ఇంట్లో పూజా మందిరంలో దేవుడిని ఆరాధించిన అనంతరం సూర్య నమస్కారం చేయాలి.
ఉగాది పండుగ రోజున ఇంటి ముందు ధ్వజారోహణం చేయాలట. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పద్ధతులు పాటించరు కానీ.. మహారాష్ట్రలో మాత్రం ప్రతి ఒక్క ఇంటి ముందు ఒక కర్రను పాతి దానికి జెండాను కట్టి ధ్వజారోహణం చేస్తారు. ఉగాది పండుగ రోజున కచ్చితంగా కొత్త బట్టలు వేసుకోవాలి. అలాగే కొత్త ఆభరణాలు ధరించాలని శాస్త్రంలో ఉందని పండితులు చెబుతున్నారు.మీరు పేదలకు ఛత్రచామరాలను దానం చేయడం వల్ల మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది. Ugadi నాడు ఈ పనులు అసలు చేయకండి, లక్ష్మీదేవీ అనుగ్రహం మీపై ఉండదని చెబుతున్న పురాణాలు, ముఖ్యంగా ఆ పని అసలు చేయవద్దు
ఉగాది రోజున దమనేన (సుగంధం వచ్చే పత్రి) పూజ చేయాలి. దమనంతో ఉగాది పండుగ రోజు నుండి పౌర్ణమి వరకూ ఒక దేవతా మూర్తిని ఎంతో నియమ నిష్టలతో పూజలు చేయాలి. చైత్ర శుక్ల పాడ్యమి రోజున బ్రహ్మకు.. విదియ రోజున శివునికి, తదియ రోజున గౌరీ శంకరులకు, చతుర్థి రోజున వినాయకుడికి, ఇలా పౌర్ణమి వరకు దేవుళ్లకు పూజలు చేయాలి. ఇక మహాశాంతి చేయడం వల్ల అన్ని దుఃఖాలు తొలగిపోతాయి. ఉగాది రోజున వినాయకుడిని, నవగ్రహాలను, బ్రహ్మదేవతలను పూజించాలని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. ఉగాది పండుగ మెసేజెస్, అద్భుతమైన కోట్స్ మీకోసం, తెలుగు సంవత్సరాది పండుగ శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి
ఉగాది పండుగ రోజున కచ్చితంగా పచ్చడి చేయాలి. ఈ పచ్చడికి నవగ్రహాలకు సంబంధం ఉందని చాలా మందికి తెలియదు. ఉగాది పచ్చడిలోని తీపికి గురుడు, ఉప్పుకు చంద్రుడు, కారానికి కుజుడు, మిరియాల పొడికి రవి, పులుపుకి శుక్రుడు అన్ని రుచులు కలిపిన వారికి శని, బుధ గ్రహాలు కూడా కారకులవుతారని పండితులు చెబుతున్నారు.