Ugadi నాడు ఈ పనులు అసలు చేయకండి, లక్ష్మీదేవీ అనుగ్రహం మీపై ఉండదని చెబుతున్న పురాణాలు, ముఖ్యంగా ఆ పని అసలు చేయవద్దు
Ugadi (Photo-Wikimedia Commons)

ఈ సృష్టి ఆరంభం అయిన కాలం యొక్క 'ఆది' ఉగాది అయ్యిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. తెలుగువారు చాలా ఆనందంగా జరుపుకునే పండుగల్లో ఉగాది పండుగ ప్రముఖమైంది. ఆ రోజున ఆరు రుచులను కలిపి ఉగాది పచ్చడిగా చేసుకుని జీవితంలో వచ్చే అటుపోట్లను తీపి, చేదు, పులుపు, కారం ఇలా అన్ని రుచులతోనూ మేళవించి తినడం అనేది మన సంస్కృతిలో భాగంగా వస్తున్న ఆచారం. ఉగాది రోజున ముఖ్యంగా ఏ పనులైతే చేస్తామో అదే పనిని సంవత్సరం అంతా చేస్తామని పెద్దలు చెబుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం వసంత రుతువు ప్రారంభ కాలంలో ఈ పండుగను జరుపుకుంటారు.ఈ కాలంలో చెట్లు బాగా చిగురిస్తాయి. పూతలు కూడా బాగా వస్తాయి. ఉగాది పండుగ మెసేజెస్, అద్భుతమైన కోట్స్ మీకోసం, తెలుగు సంవత్సరాది పండుగ శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి

ఈ సందర్భంగా ఉగాది పండుగ రోజున కొన్ని పనులను కచ్చితంగా చేయాలి. మరి కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదు. అవి చేస్తే మీరు ఏడాది పొడుగునా కష్టాలు ఎదుర్కుంటారని పురాణాలు చెబుతున్నాయి. అవేంటంటే..బద్దకంగా ఉండకూడదు. ఉగాది రోజున ఆలస్యంగా నిద్ర లేవడం అంత మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ పర్వదినాన ఆల్కహాల్, సిగరేట్, మాంసాహారాలను అస్సలు తినకూడదు. ముఖ్యంగా ఆ రోజున పంచాంగ శ్రవణాన్ని.. దక్షిణం ముఖాన కూర్చొని చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవీ అనుగ్రహం మీపై ఉండదని పురాణాలు చెబుతున్నాయి.