IPL Auction 2025 Live

Which Date is Telugu day? తెలుగు భాషా దినోత్సవం తేదీ ఎప్పుడు, తెలుగు దినోత్సవంను ఎందుకు జరుపుకుంటారు, గిడుగు వెంకట రామమూర్తి గురించి తెలుసుకోండి

తెలుగు కవి, రచయిత, స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, భాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి జయంతిని (birthday of Telugu poet Gidugu Venkata Ramamurthy) పురస్కరించుకుని ఈ తేదీని ఎంచుకున్నారు

Telugu Language Day

Telugu Language Day: భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటారు. తెలుగు కవి, రచయిత, స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, భాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి జయంతిని (birthday of Telugu poet Gidugu Venkata Ramamurthy) పురస్కరించుకుని ఈ తేదీని ఎంచుకున్నారు. భాష యొక్క మాట్లాడే మరియు లిఖిత రూపాల మధ్య అంతరాన్ని తగ్గించడం ద్వారా తెలుగును ప్రామాణిక భాషగా మార్చడంలో ఘనత సాధించారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలను గౌరవించటానికి.. ఆయన జయంతి నాడు తెలుగు భాషా దినోత్సవాన్ని (Telugu Language Day) జరుపుకుంటాము.

దేశంలో 22 అధికారిక గుర్తింపు కలిగిన భాషల్లో ఒకటిగా వెలుగొందుతున్న తెలుగు భాషకు మూలం ద్రావిడ భాష. ఆంధ్రప్రదేశ్ అధికారిక భాష చట్టం ద్వారా 1966 లో తెలుగు ను రాష్ట్ర అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం లోను తెలుగును అధికారిక భాషగా గుర్తించారు. ఇక 2008 లో కన్నడ తో పాటు తెలుగును ప్రాచీన భాష గా గుర్తించారు. హిందీ , బెంగాలీ భాషల తర్వాత దేశంలో అత్యధికులు మాట్లాడుకునే భాష తెలుగు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ.. ఇతర దేశాల్లోనూ పెద్ద సంఖ్యలో తెలుగు మాట్లాడేవారు ఉన్నారు.

గిడుగు రామ్మూర్తి జయంతి రోజే తెలుగు భాషా దినోత్సవం, ఈ చిత్రాల ద్వారా మీరు మీ స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పేయండి

1863, ఆగస్టు 29న అప్పటి మద్రాసు ప్రావిన్సులోని పూర్వపు గంజాం జిల్లాకీ, ఇప్పటి శ్రీకాకుళం జిల్లాకి చెందిన పర్వతాల పేట గ్రామంలో జన్మించిన గిడుగు రామ్మూర్తి జన్మించారు. తెలుగు భాషానిర్మాతల్లో ముఖ్యుడు. ఉపాధ్యాయుడు, చరిత్ర, శాసన పరిశోధకుడు, వక్త, విద్యావేత్తగానూ ఆయన మంచి పేరు సాధించారు. ఆయన జీవిత కాలంలో ఎన్నో ఉద్యమాలను చేపట్టడమే గాక.. అవి మంచి ఫలితాలనూ సాధించడం మరో విశేషం. ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితం చేపట్టిన గిడుగు.. విద్యకి సంబంధించిన వివిధ బాధ్యతలు నెరవేర్చారు.

పదవీ విరమణ తరువాత కూడా 1911 నుంచి 1936 దాకా పర్లాకిమిడిలోనే ఉంటూ మొత్తం ఆంధ్రదేశమంతా సంచరిస్తూ భాష, విద్య, శాసన పరిశోధన, చరిత్ర పరిశోధనలకు సంబంధించిన ఎన్నో ఉద్యమాలను గిడుగు రామ్మూర్తి చేపట్టారు. 1936లో బ్రిటిష్ ప్రభుత్వం ఒరిస్సాకు ప్రత్యేక ప్రావిన్సును ఏరాటు చేస్తూ తెలుగు వాళ్ళు అత్యధికంగా ఉన్న పర్లాకిమిడిని కూడా ఒరిస్సా రాష్ట్రంలో కలపడానికి నిర్ణయించారు. ఆ నిర్ణయం పట్ల అసమ్మతి ప్రకటిస్తూ గిడుగు రాజమండ్రి వచ్చేసారు. అప్పటినుంచి ఆయన స్వర్గస్తులయ్యేదాకా నాలుగేళ్ళ పాటు రాజమండ్రిలోనే గడిపారు.