Foods To Boost Sex Life: సుఖమయ జీవితానికి పోషకాహారమే మూలం, మీ లైంగిక సామర్థ్యంను సహజంగా పెంచుకోవాలంటే ఈ ఆహారాలను తప్పకుండా తినాలి, మిమ్మల్ని ఎవరూ ఆపలేరు!

Foods to boost sex life | Pic: Pixabay

Foods To Boost Sex Life: మీ శృంగార జీవితం బాగుండాలంటే లైంగిక ఆరోగ్యంపై శ్రద్ధ కలిగి ఉండటం ఎంతైనా అవసరం. ఇందుకు మీరు తినే ఆహారం కూడా పెద్ద పాత్ర పోషిస్తుంది. ఒక వ్యక్తికి ఉన్న ఆహారపు అలవాట్లు, వారు అనుసరించే జీవనశైలి వారి లైంగిక శ్రేయస్సుపై ప్రభావం చూపుతాయి. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా లైంగిక శ్రేయస్సును పెంపొందించుకోవచ్చు. తద్వారా జీవితంలో సుఖసంసారం ఉండటమే కాకుండా, సంతానసాఫల్యం కలుగుతుంది.

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఇవి మీ లైంగిక ఆరోగ్యం కోసం మంచి పోషణ అందిస్తాయి. నట్స్, బెర్రీలు, బచ్చలికూర, అవకాడో, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఇతర ఆహారాలు మీ అవయవాల్లో రక్త ప్రసరణను పెంచుతాయి. తద్వారా మీ లిబిడో, స్టామినాను మెరుగుపరుస్తాయి.

లైంగిక జీవితంలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం ముఖ్యమే. సాల్మన్ చేపలు, ఫ్లాక్స్ సీడ్స్ వంటి వాటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఇలాంటి ఆహారాలు మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి, ఇది ఆరోగ్యకరమైన లైంగిక సంబంధాలను ప్రోత్సహిస్తుంది. వీటితో పాటు లైంగిక పనితీరు మెరుగుపడాలంటే ఆల్కహాల్, కెఫిన్ , ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించాలి, స్మోకింగ్ చేయడం పూర్తిగా మానేయాలి.

మీ లైంగిక సామర్థ్యాన్ని సహజంగా మెరుగుపరచుకోవడానికి మీరు ప్రతిరోజూ తప్పకుండా తినాల్సిన కొన్ని ఆహారాలను ఇక్కడ జాబితా చేశాము, వీటిని మీ రోజూవారి డైట్ లో చేర్చుకోండి.

 

దానిమ్మ

మీ లైంగిక ఆరోగ్యం, సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి ఉత్తమమైన ఆహారాలలో దానిమ్మ రసం ఒకటి. లైంగిక ఆనందాన్ని పెంచడానికి దానిమ్మ రసం కచ్చితంగా తాగాలి. ఎందుకంటే ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. తద్వారా మీరు ఉత్సాహంగా శృంగారంలో పాల్గొంటారు.

బచ్చలికూర

బచ్చలికూరలో మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతాయి. ముఖ్యంగా స్త్రీలలో ఉద్రేకం, కోరిక, ఉద్వేగం పెంచుతాయి. మెరుగైన లైంగిక సంతృప్తికి బచ్చలికూర తింటూ ఉండాలి.

ఉల్లిపాయలు

ఉల్లిపాయలు లూటినైజింగ్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది శరీరంలో యాంటీఆక్సిడెంట్లను పెంచడం, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడం ద్వారా టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతాయి. ఉల్లిపాయల్లో క్వెర్సెటిన్, కెంప్ఫెరోల్, సల్ఫర్ ఉన్నాయి. ఇవన్నీ లైంగిక ఆరోగ్యానికి పోషణను ఇస్తాయి.

స్ట్రాబెర్రీలు

స్ట్రాబెర్రీస్‌లో చాలా విటమిన్ సి లోడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది అవయవాలకు రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది , లైంగిక కోరికలను పెంచుతుంది. స్ట్రాబెర్రీలు తినడం ద్వారా శరీరంలో ఉద్వేగం, లైంగిక ఆనందానికి సంబంధించిన ప్రేమ హార్మోన్ అయిన ఆక్సిటోసిన్ విడుదలలో కూడా సహాయపడతాయి.

అవకాడో

గుండె-ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్ B6 సమృద్ధిగా ఉన్న అవకాడోలు స్త్రీలకు మరింత శృంగారభరితమైన అనుభూతిని కలిగిస్తాయి. పడకగదిలో ఎక్కువ సమయం పాటు శక్తిని కోరుకునేవారు అవకాడోలు ఆహారంలో చేర్చుకోవాలి. అవకాడో తినడం ద్వారా స్త్రీలలో PMS లక్షణాలను కూడా తగ్గించవచ్చు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif