Health Tips: కలబందతో అద్భుత ప్రయోజనాలు, మీకు తెలిస్తే అస్సలు వదలరు, చర్మ సమస్యలే కాదు ఇంకా ఎన్నో వ్యాధులకు దివ్యాఔషధం కలబంద!

సాధారణంగా దీనిని చర్మ సంబంధింత మెడిసిన్స్ తయారిలో ఎక్కువగా వాడుతుంటారు. ఇందులో ఉండే గ్లిసరిన్, సోడియం ఫామాల్ చర్మ సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేగాదు కలబందలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ప్రిరాడికల్స్ చర్మాన్ని సంరక్షిస్తాయి.

Amazing Uses for Aloe Vera,these are the benefits of aloe vera

Hyd, Aug 23: సహజ సిద్దంగా ప్రకృతిలో దొరికే దివ్యమైన ఔషధ గుణాలు కలిగిఉన్న వాటిలో ఒకటి కలబంద. సాధారణంగా దీనిని చర్మ సంబంధింత మెడిసిన్స్ తయారిలో ఎక్కువగా వాడుతుంటారు. ఇందులో ఉండే గ్లిసరిన్, సోడియం ఫామాల్ చర్మ సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేగాదు కలబందలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ప్రిరాడికల్స్ చర్మాన్ని సంరక్షిస్తాయి.

ఒక చర్మ సంబంధింత సమస్యలే కాదు కలబందతో అద్బుత ప్రయోజనాలున్నాయి. శరరీరంపై ఏర్పడే గాయాలను వేగంగా తగ్గించడంలో సాయపడతాయి. ముఖ్యంగా కలబందలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ముఖ్యమైనవి. ఇన్ఫెక్షన్‌లకు కారణమయ్యే కొన్ని బ్యాక్టీరియాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి.

కాలిన గాయాలను నయం చేసే దివ్య ఔషధంగా కలబంద పనిచేస్తుంది. శరీరంపై ఎరుపు, దురద మరియు ఇన్ఫెక్షన్లను నివారించడానికి కూడా సహాయపడుతుంది.

దంత క్షయం మరియు చిగుళ్ల వ్యాధులను తగ్గించడంలో కలబంద బాగా పనిచేస్తుంది. ఇందుకు సంబంధించి ఓ పరిశోధనలో రుజువైంది కూడా. 8-14 సంవత్సరాల వయస్సు గల 152 మందిపై పరీశ్రీ చేయగా మంచి ఫలితం వచ్చింది.

నోటిపూత వంటి వంటి వ్యాధులను తగ్గించడంలో కలబంద సాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారించడంలో కలబంద ప్రత్యేకతే వేరు.జీర్ణశక్తిని పెంపొందించుకోడానికి, గుండె లో మంటని తగ్గించుకునేందుకు కలబంద రసం తాగితే ఉపశమనం పోందవచ్చు.  కామెర్ల వ్యాధితో బాధపడుతున్నారా.ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. 

కలబంద గుజ్జుని రోజ్‌వాటర్‌లో కలిపి శరీరానికి పూస్తే మృత కణాలు తోలగిపోతాయి, చర్మం నిగనిగలాడుతుంది. ఎండకాలంలో వడదెబ్బ తగలకుండా ఉడలంటే కలబంద రసం తాగితే గ్లుకోజ్ వలె పని చేస్తుంది.