Water Melon: పుచ్చకాయ తిని గింజలు పారేస్తున్నారా, అయితే పొరపాటే, వీర్య కణాల సంఖ్య పెంచుకునేందుకు అద్భుత ఔషధం ఇదే..
పుచ్చగింజల్లో ఉన్న పోషక విలువలేమిటో చూద్దాం.
చాలామంది సీజన్ తో సంబంధం లేకపోయినా పుచ్చకాయ (Water Melon) ముక్కలను ఇష్టపడతారు.వేసవికాలంలో ఎండల్లో పుచ్చకాయ (Water Melon) ముక్కలను తింటే ఆ అనుభూతే వేరు. పుచ్చకాయ (Water Melon) ముక్కలను తినటం వలన వేసవిలో కలిగే దాహం బాగా తీరుతుంది. అయితే మనం పుచ్చకాయ (Water Melon) ముక్కలను తిని గింజలను పడేస్తూ ఉంటాం. అయితే గింజలలో అనేక పోషక విలువలు ఉన్నాయి. పుచ్చకాయ (Water Melon) గింజల్లో విటమిన్స్‌తో పాటు మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, పాస్పరస్, కాపర్, జింక్, మాంగనీస్ సమృద్ధిగా ఉంటాయి. పుచ్చగింజల్లో ఉన్న పోషక విలువలేమిటో చూద్దాం.
పుచ్చకాయ (Water Melon) గింజల వల్ల కలిగే లాభాలు
రోగనిరోధక శక్తిని ఉత్తేజితం చేయంలో పుచ్చ గింజలు బాగా ఉపయోగపడతాయి. రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రిస్తాయి. పుచ్చ గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి తర్వాత ఆరబెట్టుకోవాలి. ఆ తరువాత వీటిపైనున్న పొట్టును తీసి తింటే చాలా మంచిది. ఈ గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.
>> పుచ్చకాయ (Water Melon) గింజల్లో ఎల్ సిట్రులిన్ సమృద్ధిగా ఉండుట వలన కండరాలు బలంగా ఉండేందుకు మరియు కండరాల కణజాలాన్ని రిపేర్ చేయటానికి బాగా సహాయపడుతుంది.
>> పుచ్చకాయ (Water Melon) విత్తనాలను రోజూ తినడం వల్ల కండరాలు దృఢంగా మారుతాయి. అలసట తగ్గుతుంది.
>> పుచ్చకాయ (Water Melon) విత్తనాలు షుగర్ ను అదుపులో ఉంచుతుంది.
>> హైబీపీ ఉన్నవారు పుచ్చకాయ (Water Melon) విత్తనాలను తింటే బీపీ తగ్గుతుంది. బీపీ త్వరగా అదుపులోకి వస్తుంది
>> కంటిజబ్బులకు కూడా పుచ్చకాయ (Water Melon) విత్తనాలు బాగ పనిచేస్తాయి. కంటి వెంట నీరుకారడం, కంట్లో మంట, దురద వంటి సమస్యలు ఉంటే పుచ్చకాయ (Water Melon) గింజలు అధ్బుతంగా పనిచేస్తాయి.
>> మెదడు పనితీరు మెరుగ్గా ఉండాలంటే పుచ్చకాయ (Water Melon) విత్తనాలను రోజూ తినాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పుచ్చకాయ (Water Melon) వల్ల కలిగే లాభాలు
>> డీహైడ్రేషన్ సమస్యను నివారించవచ్చు.
>> ఎండ వల్ల వచ్చే టాన్, దద్దుర్లను తగ్గిస్తుంధి.
>> బీపీ ని కంట్రోల్ చేస్తుంది. రక్త సరఫరా మెరుగుపరుస్తుంది.
>> శరీరంలోని వ్యర్ధాలను బయటికి పంపిస్తుంది.
>> నాడీ వ్యవస్థ పని తీరుని మెరుగుపరుస్తుంది. దాని వల్ల మనసుకు శరీరానికి ప్రశాంతతను చేకూరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది .
>> పుచ్చకాయ (Water Melon) గింజలలో పురుషుల వీర్య కణాల ఉత్పత్తి పెంచే ఔషధ గుణాలున్నాయి.
>> ఇందులో ఉండే ‘విటమిన్ ఎ’ వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.