Health Tips: పీరియడ్ క్రాంప్స్ తో బాధపడుతున్నారా..ఈ చిట్కాలతో మీ నొప్పి కి ఉపశమనం.

చాలామంది మహిళల్లో పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటారు. వీటిని పీరియడ్ క్రాంప్స్ అంటారు. ఇవి దాదాపుగా అందరూ మహిళలను కనిపించే సాధారణ సమస్య

irregular periods

చాలామంది మహిళల్లో పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటారు. వీటిని పీరియడ్  క్రాంప్స్ అంటారు. ఇవి దాదాపుగా అందరూ మహిళలను కనిపించే సాధారణ సమస్య. అయితే కొన్ని మన జీవన శైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఈ పిరియడ్ క్రాంప్స్ నుంచి ఈజీగా బయటపడవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కారణాలు:

హార్మోనల్ ఇంబాలన్స్ : ముఖ్యంగా హార్మోనల్ ఇంబాలన్స్ వల్ల మహిళల్లో పిరియడ్ క్రాంప్స్ వస్తూ ఉంటాయి. అంతే కాకుండా రక్తహీనత, అలసట నీరసం , ఒత్తిడి పోషకాహార లోపం, కాలుష్యం వల్ల కూడా ఈ పిరియడ్ క్రాంప్స్అనేవి పెరుగుతాయి. కొన్ని రకాల మార్పుల వల్ల మనము ఈ పీరియడ్ క్రాంప్స్ ని తగ్గించుకోవచ్చు.

వ్యాయామం: కొన్ని రకాలైన అప్డోమినల్ వ్యాయామాలు చేయడం ద్వారా పీరియడ్స్ లో వచ్చే క్రాంప్స్ తగ్గిపోతాయి. ముఖ్యంగా పొత్తికడుపులో కండరాల్లో నొప్పులు తగ్గిపోతాయి.

హీట్ ప్యాక్: సాధారణంగా పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ క్రాంప్స్ ని తగ్గించే మరొక  చిట్కా హీటింగ్ ప్యాక్. ఇది నొప్పి ఉన్న ప్రదేశంలో హీటింగ్ ఫ్యాక్ గనక కాసేపు పెట్టుకున్నట్లయితే ఆ ప్రదేశంలో ఉన్న నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది.

Health Tips: రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా.

వేడినీటి స్నానం: పీరియడ్స్ ఉన్నన్ని రోజులు కూడా వేడి నీటి స్నానం చేయడం ద్వారా ఈ క్రాంప్స్ తగ్గుముఖం పడతాయి. వేడి నీటి స్నానం వల్ల కండరాలు నొప్పులు అన్నీ కూడా తగ్గిపోతాయి.

తగినంత నిద్ర: పీరియడ్స్ సమయంలో కావాల్సినంత విశ్రాంతి తీసుకుంటే పిరియడ్స్ నొప్పుల నుండి ఈజీగా బయటపడవచ్చు. శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం ద్వారా ఈ నెలసరిలో వచ్చే క్రాంప్స్ ఈజీగా తగ్గుముఖం పడతాయి.

తక్కువ ఉప్పు: ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ పీరియడ్స్ క్రాంప్స్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి పీరియడ్స్ సమయంలో ఉప్పును తక్కువగా తీసుకుంటే మీరు ఈ క్రాంప్స్ నుంచి బయటపడవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement