చాలామంది హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్యతోటి రకరకాలైన జబ్బులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్ సరఫరా సక్రమంగా అందదు. దీని ద్వారా మన శరీరంలో ఉన్న కణాలన్నీ కూడా దెబ్బతింటాయి. ఎనీమియా సమస్యతో బాధపడేవారు ముఖ్యంగా కళ్ళు తిరగడం, అలసట, నీరసం, ఆందోళన ,గుండె దడ వంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా రక్తం తక్కువగా ఉండటం వల్ల చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది అందుకే కొన్ని రకాలైన పండ్ల ద్వారా రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు.పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ రక్తహీనత సమస్య అనేది అధికంగా ఉంటుంది. తగ్గించుకోవడానికి పండ్లను వాడినట్లయితే మీ ఎనీమియా సమస్య తగ్గిపోతుంది.
అంజీర పండు: ఈ పండులో అనేక రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా బి12, జింక్, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియము, పొటాషియము వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి. ఇది మీరు ప్రతిరోజు 2 అంజీర పండ్లను తీసుకున్నట్లయితే మీ రక్తం హిమోగ్లోబిను అమంతంగా పెరుగుతుంది. ఇవి పండ్లుగా తీసుకోవచ్చు లేదా డ్రై ఫ్రూట్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఏ విధంగా తీసుకున్న దీని పోషకాలు అధికంగా ఉంటాయి. మీ రక్తహీనత సమస్యకు ఇది చక్కటి పరిష్కారం.
దానిమ్మ: దానిమ్మ పండులో కూడా రక్తాన్ని పెంచే అమోఘ గుణాలు ఉన్నాయి. ఇది మీ శరీరంలో రక్త వృద్ధికి తోడ్పడుతుంది.
Health Tips: మధుమేహం ఉన్న వారికి ఈ 5 చర్మ సమస్యలు వచ్చే ఛాన్స్ ...
క్యారెట్ బీట్రూట్ జ్యూస్ : క్యారెట్ బీట్రూట్ జ్యూస్ వల్ల కూడా మీకు రక్తహీనత సమస్య నుంచి బయటపడతారు. ప్రతిరోజు రెండు క్యారెట్లు ఒక బీట్రూట్ ని కలిపి మిక్సీ చేసుకొని ఆ జ్యూస్ ని కనుక తీసుకున్నట్లయితే మీరు రక్తహీనత సమస్య నుంచి తొందరగా బయటపడతారు.
ఎండు ద్రాక్ష: ఎండు ద్రాక్షలో కూడా ఐరన్, జింగ్, పొటాషియం, ఫైబర్, కంటెంట్ లో అధికంగా ఉంటాయి. ప్రతిరోజు ఒక ఐదు నుండి 10 కిస్మిస్ పనులను తీసుకున్నట్లయితే మీ శరీరంలో రక్త వృద్ధికి తోడ్పడుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.