Health Tips: తరచుగా ఎసిడిటీ, ఛాతిలో మంట సమస్యతో బాధపడుతున్నారా ఆలస్యం చేయకండి, క్యాన్సర్ సంకేతం కావచ్చు..

అయితే ఇది తరచుగా రావడం నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.

gas

తరచుగా చాలామందిలో ఎసిడిటీ, చాతిలో మంట, చాతిలో పట్టేసినట్టు వంటి సమస్యలు ఏర్పడతాయి. అయితే ఇది తరచుగా రావడం నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఇది కొన్నిసార్లు కడుపులో వచ్చే క్యాన్సర్ సంకేతంగా చెప్పవచ్చు.

తరచుగా ఎసిడిటీ రావడానికి కారణం- ఎక్కువగా ఆయిల్ ఫుడ్లను ,స్పైసీ ఫుడ్లను నాన్ వెజ్ ఫుడ్లను ఎక్కువగా తీసుకోవడం లేదా ఎక్కువ సేపు పొట్టను ఖాళీగా ఉంచడం వల్ల ,ఎసిడిటీ సమస్య ఏర్పడుతుంది. అయితే దీన్ని చాలా మంది గ్యాస్ ప్రాబ్లం ని చాలా తేలికగా తీసుకుంటారు. అయితే ఇది కొన్ని సార్లు చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఒక్కొక్కసారి కడుపులో క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెంది ఈ సింటమ్స్ ను చూపిస్తాయి. ఒక్కోసారి ఇది ప్రాణాంతకంగా కూడా మారుతుంది. సకాలంలో గుర్తించి చికిత్స చేసుకుంటే బయటపడవచ్చు.

Health Tips: చలికాలంలో పచ్చి బఠానీలు తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు..

కడుపు క్యాన్సర్ లక్షణాలు- తరచుగా గుండెల్లో మంట రావడం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావడం కూడా దీనికి సంకేతంగా చెప్పవచ్చు. ఎక్కువగా ఆసిడ్ రిఫ్లెక్షన్స్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. తరచుగా వాంతులు, ఏది తిన్న పడకపోవడం, కడుపు ఉబ్బినట్లుగా ఉండడము ఉంటుంది. కొన్నిసార్లు గ్యాస్టిక్ క్యాన్సర్ నువ్వు సకాలంలో చికిత్స చేయకపోతే అది శరీరం అంతా వ్యాపించి ప్రాణాంతకంగా మారుతుంది. పదేపదే ఎసిడిటీ సమస్యతో బాధపడుతూ కడుపులో ఫైలోరి ఇన్ఫెక్షన్ కారణమవుతుంది. ఇది ఈ ఇన్ఫెక్షన్ పొట్టలోని డిఎన్ఎను దెబ్బతీస్తుంది. ఇది రాను రాను కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని మరింతగా పెంచుతుంది.

నివారణ- కడుపు క్యాన్సర్ ను నివారించుకోవడానికి కొన్ని రకాల చర్యలు పాటిస్తే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా మనం తీసుకునే ఫుడ్ ను లో పోషకాహారాలు, కాయగూరలు ,పండ్లు ఉండేలాగా చూసుకోవాలి. ఆయిల్ ఫుడ్లు స్పైసీ ఫుడ్లకు దూరంగా ఉంటే మంచిది క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం బరువు నియంత్రణలో ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ఆహారాన్ని రాత్రి పడుకోవడానికి రెండు గంటల ముందే తీసుకోవాలి. తిన్న వెంటనే ఎప్పుడు కూడా పడుకోకూడదు. కాసేపు నడవడం వల్ల తిన్నది కాస్త అరుగుతుంది. ప్రతిరోజులో యోగ వ్యాయామాన్ని మెడిటేషన్ వంటి వాటిని చేర్చుకోవడం మంచిది. ఆల్కహాలు ధూమపానం వంటివి కూడా ఎసిడిటీ సమస్యను మరింతగా పెంచుతాయి. కెఫిన్ ఎక్కువగా ఉన్న ఆహార తీసుకోకూడదు.

ఒకవేళ మీకు గుండెల్లో మంట , అనిపిస్తే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం, మలము నలుపు రంగులో రావడం, కామెర్లు, మింగడంలో ఇబ్బందులు వాంతులు వంటి సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించి దానికి తగినంత చికిత్స తీసుకోవడం ఉత్తమం.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి