పచ్చి బఠానీలు ఒక మంచి పోషకాహారమని చెప్పవచ్చు. దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. చలికాలం వచ్చిందంటే చాలు ఇది ఈజీగా దొరుకుతుంది. అనేక రకాల వంటల్లో వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఇది రుచికి మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉంది. చలికాలంలో పచ్చిబఠానీలు తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి బఠానీలో ఉన్న పోషకాలు- పచ్చి బఠానీలలో ఫైబరు విటమిన్ ఏ ,బి ,సి, కె ప్రోటీన్ ,ఐరన్, మెగ్నీషియం, జింకు, పోలేట్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరానికి బలాన్ని అందిస్తా ఇందులో విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది మన చర్మాన్ని కాంతివంతంగా అనేక రకాల జబ్బులు రాకుండా చేస్తుంది. జుట్టుకు కూడా బలాన్ని ఇస్తుంది.
జీర్ణ క్రియ కు మంచిది- కడుపు బరం, కడుపు నొప్పి, వంటి సమస్యలతో బాధపడే వారికి పచ్చి బఠాణి ఒక చక్కటి ఎంపిక అని చెప్పవచ్చు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. మలబద్ధకం సమస్యతో బాధపడే వారికి ఇది చక్కటి పరిష్కారాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఇందులో తక్కువ క్యాలరీలు ఫైబర్ అధికంగా ఉండడం ద్వారా బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కటి ఆహారంగా చెప్పవచ్చు. దీన్ని తీసుకోవడం ద్వారా కడుపు నిండిన అనుభూతి ఉంటుంది.
Health Tips: మీ మొఖం చంద్రబింబంలో మెరిసిపోవాలనుకుంటున్నారా.
షుగర్ను కంట్రోల్ చేస్తుంది- ఇది రక్తంలోని షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. డయాబెటిక్ రోగులకు పచ్చి బఠానీలు చాలా మేలును కలిగిస్తాయి. ఇందులో విటమిన్ కె, క్యాల్షియం అధికంగా ఉండడం ద్వారా ఎముకల బలోపేతానికి సహాయపడుతుంది. అనేక రకాల ఎముకల వ్యాధులను తగ్గించడంలో కూడా పచ్చి బఠాణీలు సహాయపడతాయి.
గుండెకు మంచిది- పచ్చి బఠానీలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో పొటాషియం అధికంగా ఉండడం ద్వారా బీపీ సమస్యతో బాధపడే వారికి ఇది చక్కటి ఔషధంగా చెప్పవచ్చు. బీపీని కంట్రోల్ లో ఉంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పచ్చి బఠాణీలలో ఐరన్ అధికంగా ఉంటుంది. రక్తహీనత సమస్యను తొలగించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే పాలిఫైనల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి