Health Tips: గోరు చిక్కుడు కాయ ఉపయోగాలు తెలిస్తే షాక్ తినడం ఖాయం..ఈ జబ్బులు రమ్మన్నా రావు..

ఈ కూరగాయలో ఫైబర్, పొటాషియం, ఫోలేట్ సమృద్ధిగా ఉండటం వల్ల అనేక రకాల గుండె సమస్యల నుండి రక్షిస్తుంది.

chikudkaya

గోరుచిక్కుడు కాయను ఇష్టంగా తినేవారు చాలా తక్కువే. కానీ ఈ కూరగాయ ఇతర కూరగాయల కంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. అవేంటో మీకు తెలిస్తే రోజు మీరు ఆహరంలో చేర్చుకుంటారు. అదేంటో తెలుసుకుందామా.. చాలా మంది గోరుచిక్కుడును ఇష్టపడకపోవచ్చు కానీ ఈ కూరగాయ చాలా రుచిగా, పోషకమైనదిగా ఉంటుంది. హిందీలో దీనిని గవర్ ఫాలీ అని పిలుస్తారు. ఇది క్లస్టర్స్ బీన్స్ కుటుంబానికి చెందినది.

క్లస్టర్ బీన్స్ లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. అలాగే ఎముకలు దెబ్బతినకుండా కాపాడుతుంది. ఈ కూరగాయలలో భాస్వరం ఉండటం వల్ల ఎముకలు గట్టిగా ధృడంగా తయారవుతాయి.

క్లస్టర్ బీన్స్ లో ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి. ఇవి శరీర రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర వహిస్తాయి. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను వేగంగా హెచ్చుతగ్గులు లేకుండా చేస్తుంది.

ఈ గోరుచిక్కుడు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడమే కాకుండా గుండెను ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తుంది. ఈ కూరగాయలో ఫైబర్, పొటాషియం, ఫోలేట్ సమృద్ధిగా ఉండటం వల్ల అనేక రకాల గుండె సమస్యల నుండి రక్షిస్తుంది.

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...

గోరుచిక్కుడులో ఉండే ఐరన్, కాల్షియం గర్భిణీ స్త్రీలలో ఖనిజాల లోపాన్ని భర్తీ చేస్తాయి. ఈ కూరగాయలలో ఫోలీక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది పిండాన్ని, అనేక రకాల సమస్యల నుంచి రక్షిస్తుంది. ఈ బీన్స్ లో విటమిన్ కె ఉంటుంది. ఈ విటమిన్ కె ఎముకలను బలంగా ఉంచుతుంది. శిశువుకు మెరుగైన అభివృద్ధికి ఇది సహాయపడుతుంది.

ఈ బీన్స్ లోని హైపోగ్లైసీమిక్, హైపోలిపిడెమిక్ లక్షణాలు అధిక రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులకు ఉత్తమమైన సహజ నివారణలలో ఒకటిగా పని చేస్తాయి. మధుమేహం, గుండె జబ్బులు ఉన్న వ్యక్తులు అధిక రక్తపోటుకు గురయ్యే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో ఈ గోరు చిక్కుడు తీసుకోవడం వలన చాలా మేలు జరుగుతుంది.

గోరు చిక్కుడు లో ఉండే ఐరన్ హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది శరీరంలో రక్తం లేకపోవడాన్ని భర్తీ చేస్తుంది. ఇది కాకుండా గ్వారలో ఫైటోకెమికల్స్ కూడా ఇందులో ఉంటాయి. ఇది రక్తం ఆక్సిజన్-వాహక సామర్థ్యాన్ని పెంచుతుంది. తర్వాత రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

ఈ బీన్స్ లోని హైపోగ్లైసీమిక్ లక్షణాలు ఉండటం వలన నరాలను సడలించడంలో సహాయపడతాయి. ఈ గోరు చిక్కుడు తినడం వలన ఆందోళన, ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మానసికంగా ప్రశాంతంగా ఉంచడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది.

ఈ గోరు చిక్కుడు జీర్ణక్రియకూ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రేగు కదలికను ప్రోత్సాహించడం ద్వారా జీర్ణవ్యవస్థను మెరుగుపరచవచ్చు.ఇవి కడుపులో ఉన్న విషపదార్ధాలను బయటకు పంపి, జీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది.