Immunity Boosting Drink : ఈ జ్యూస్ తాగితే ఒమిక్రాన్ ను ఎదుర్కొనే, రోగనిరోధక శక్తి రావడం ఖాయం, మీ ఇంట్లోనే తయారు చేసుకోండిలా...
అంతేకాదు యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలకు కూడా కలిగి ఉంది. అంతేకాదు మన ప్రేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచుతుంది.
దేశ వ్యాప్తంగా మళ్ళీ భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ పెద్ద ప్రమాదకారి కాదంటూ కొంచెం ఊరట కలిగించేలా పలునివేదికలు చెబుతున్నాయి. అయితే అసలు వ్యాధి రాకుండా తీసుకునే నివారణ చర్యలే ఉత్తమం. కనుక రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేలా పోషకాహారాన్ని తీసుకోవాలి. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచే సహజమైన ఆహార పదార్ధాలు అంటూ పోషకాహార నిపుణులు కొన్ని ఉత్తమ ఆహారపదార్ధాలను తయారు చేసుకోవడం చెబుతున్నారు. తాజాగా ఉత్తమ రోగనిరోధక శక్తినిచ్చే వంటకం పోషకాహార నిపుణురాలు షేర్ చేశారు.
రోగనిరోధక శక్తిని పెంచే పదార్ధాల తయారీ విధానం:
3-4 మీడియం పచ్చి పసుపు కొమ్ములుఎం(లేదా కొంచెం పసుపు), 2 మీడియం క్యారెట్లు, 2 అంగుళాల అల్లం తీసుకోండి. ఈ మూడింటిని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేయండి.. అవసరం అయితే కొంచెం నీరు పోసుకుని జ్యుస్ తయారు చేసుకోండి. దీనిని 20-30 ml వరకూ రోజూ ఉదయం త్రాగండి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఆరోగ్య ప్రయోజనాలు:
పసుపు మంచి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాదు యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలకు కూడా కలిగి ఉంది. అంతేకాదు మన ప్రేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచుతుంది. ఆయుర్వేదం ప్రకారం.. పచ్చి పసుపు 300 కంటే ఎక్కువ పోషకాలతో కూడిన శక్తివంతమైన మూలిక. ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. క్యారెట్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. అల్లంలో మంచి ఔషధ గుణాలున్నాయి. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు రాకుండా నివారిస్తుంది.