Sex After Having Heavy Meal: కడుపు నిండా తిన్న తర్వాత సెక్స్‌లో పాల్గొనొచ్చా, అలా చేయడం వల్ల ఏర్పడే సమస్యలు ఏమిటి, ఏ సమయం అనుకూలంగా ఉంటుంది.

మన దేశంలో ఎక్కువ మంది పగలు కంటే రాత్రి వేళల్లోనే సెక్స్ చేయడానికి ఆసక్తి చూపుతారు.

representational image (Photo Credits: Max Pixel)

సెక్స్ ఏ సమయంలో చేస్తే మంచిది? కడుపు ఖాళీగా ఉన్నప్పుడు సెక్స్ చేయొచ్చా? లేదా కడుపునిండా తిన్న తర్వాత చేయాలా? ఇలా ఎన్నో అనుమానాలు వెంటాడుతుంటాయి. మన దేశంలో ఎక్కువ మంది పగలు కంటే రాత్రి వేళల్లోనే సెక్స్ చేయడానికి ఆసక్తి చూపుతారు. అది కూడా రాత్రి శుభ్రంగా భోజనం చేసిన తర్వాత నిద్రకు సిద్ధమవుతున్న సమయంలో రొమాన్స్ మొదలుపెడతారు. భోజనం చేసిన తర్వాత శరీరానికి బోలెడంత శక్తి వస్తుందని, అది సెక్స్ చేసేందుకు శక్తిని ఇస్తుందని భావిస్తారు. అలాగే, భోజనం జీర్ణం కావడానికి కూడా సెక్స్ ఉపయోగపడుతుందని అనుకుంటారు. కానీ, అలా చేయడం అంత మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత సెక్స్ చేస్తే ఏం జరుగుతుంది? ఎలాంటి సమస్యలు వస్తాయి? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

భోజనం చేసిన వెంటనే చేయకపోవడమే ఉత్తమం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ మంది భోజనం తర్వాతే సెక్స్ చేయడానికి ఇష్టపడతారు. అలా చేయడం వల్ల నష్టమే తప్పా.. లాభం ఉండదని హెచ్చరిస్తున్నారు. భోజనం చేసిన వెంటనే సెక్స్ చేయడం వల్ల కడుపులో మంట ఏర్పడుతుందని, అది క్రమేనా అసిడిటీకి దారి తీయవచ్చని చెబుతున్నారు. అంటే, భోజనానికి.. సెక్స్‌కు మధ్యం కనీసం రెండు గంటల గ్యాప్ ఉంటే మంచిది. ఆయుర్వేద వైద్యు నిపుణుల సూచనల ప్రకారం..అర్థరాత్రి వేళల్లో సెక్స్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట.

సెక్స్ చేయాలనే మూడ్ వస్తే.. కొందరు ముహూర్తాలను కూడా చూసుకోరు. అయితే, కొన్ని సమయాలను ఖచ్చితంగా పాటిస్తే తప్పకుండా మంచి సెక్స్‌ను ఆస్వాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తెల్లవారుజాము 5 గంటల నుంచి 8 గంటల లోపు చేసే సెక్స్ భలే రసవత్తరంగా సాగుతుందట. తెల్లవారుజామున పురుషాంగం సైతం సెక్స్‌కు బాగా సహకరిస్తుందట. ఆ సమయంలో ప్రేరణ లేకుండానే పురుషాంగం గట్టిపడి పార్టనర్‌కు స్వర్గం చూపిస్తుందట.

కొన్ని ఆహారాల్లో కార్బో‌హైడ్రేట్ల స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. వాటివల్ల కడుపులో గ్యాస్‌లు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. భోజనం చేసిన తర్వాత శరీరం అత్యధిక రక్తాన్ని జీర్ణాశయానికి పంపుతుంది. దీనివల్ల వల్ల ఆహారం బాగా జీర్ణమవుతుంది. కాబట్టి.. తిన్న వెంటనే సెక్స్ లేదా వ్యాయామాలు చేస్తే వికారం ఏర్పడుతుంది. ఆ జీర్ణసంబంధిత సమస్యలతోపాటు ఇతరాత్ర ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకొనే ప్రమాదం ఉంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif