Healthy Breakfast: బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం మంచిదే, ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారం మీ బ్రేక్ ఫాస్ట్‌లో లేనప్పుడు. ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లో ఆరోగ్యకరం ఏమిటో తెలుసుకోండి.
ఉదయం లేవగానే మన పనుల్లో మనం బిజీబిజీగా ఉంటాం. ఒక్కోసారి బ్రేక్‌ఫాస్ట్ చేయటానికి కూడా టైం ఉండదు, అలాగే మన పనులకు మనం వెళ్లిపోతుంటాం. మనకు చాలా మంది చెప్తుంటారు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయకపోతే మంచిది కాదు అని. అయితే ఏది పడితే అది అనారోగ్యకరమైన తిండి (Unhealthy food) తినడం కంటే కూడా బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడమే చాలా ఉత్తమం అంటున్నారు న్యూట్రాలజిస్టులు. ఒకవేళ కొన్నిసార్లు మీరు బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా వెళ్లిన సందర్భాల్లో ఆ రోజులో మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్నైనా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు.
మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే అది శరీరానికి ఒక రోజుకు అవసరమయ్యే శక్తిని అందివ్వడమే కాకుండా ఆ రోజులో మిగతా సమయం అంతా అతిగా తినటాన్ని కూడా నియంత్రించి శరీరంలో సమతుల్యతను
కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ ((Healthy Breakfast) )అంటే అందులో ఇవి ఉండేలా చూసుకోండి.
గుడ్లు
ఒక అధ్యయనం ప్రకారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తీసుకుంటే ఆ వెంటనే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. ఆ రోజులోని మిగతా సమయంలో తీసుకునే ఆహారం కూడా ఎక్కువ, తక్కువ కాకుండా కావాల్సిన మేరకే తీసుకుంటాం. తద్వారా శరీరంలో కెలరీలు తగ్గుతాయి. అంతేకాకుండా రక్తంలో షుగర్, ఇన్సులిన్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి అని వెల్లడైంది.
గుడ్ల సొనలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కంటి చూపుకు మంచివి. ఇవి శరీరానికి కావాల్సిన ముఖ్యమైన ప్రోటీన్లు, పోషకాలు అందజేస్తాయి.
ఓట్ మీల్
ఓట్ మీల్ అందరూ ఖచ్చితంగా ఎంపిక చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన బ్రేక్‌ఫాస్ట్. ఈ ఓట్ మీల్స్‌లో ముఖ్యమైన ఫైబర్, ఆంటీఆక్సిడెంట్లు మరియు ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శరీరంలో కొవ్వును తగ్గించడంతో పాటు మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బ్లెడ్ ప్రెజర్స్, ఊబకాయం, హృద్రోగ సమస్యలు ఉన్నవారికి ఓట్ మీల్ మంచి బ్రేక్‌ఫాస్ట్. 235 గ్రాముల ఓట్ మీల్ ను పాలతో కలుపుకొని ప్రతితోరు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తినాలి.
పండ్లు
మీ రోజు ఫలవంతగా సాగాలంటే ఉదయాన్నే మీ కడుపును నోరూరించే పండ్లతో నింపేయాల్సిందే. పండ్లు ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిలో ఎన్నో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కావాల్సినంత ఫైబర్, శరీరానికి అవసరమయ్యే హైడ్రేషన్ కూడా పండ్ల ద్వారా లభిస్తుంది. ఒక కప్పు ఆపిల్ ముక్కలు, లేదా సిట్రస్ జాతికి చెందిన నారింజ, సంత్ర పండ్లు లేదా బెర్రీస్ ఏవైనా సరే మంచి బ్రేక్‌ఫాస్ట్ జాబితాలో ఉంటాయి.
నట్స్ మరియు సీడ్స్
నట్స్ తినటానికి ఎంత రుచిగా ఉంటాయో, వాటి నుంచి శరీరానికి లభ్యమయ్యే పోషకాలు కూడా చాలా లభ్యమవుతాయి. నట్స్ లో కెలరీలు చాలా ఉన్నా కొవ్వు ఏమాత్రం రాదు. బరువు తగ్గటానికి నట్స్ చాలా ఉపయోగకరం, శక్తివంతం కూడా. వీటిలో మెగ్నీషియం, పొటాషియం లాంటి మినరల్స్ శరీరానికి అందుతాయి. రోజు ఉదయం 50 -60 గ్రాముల నట్స్ తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది.
అలాగే ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ శరీరంలో షుగర్ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంచుతూ, ఇన్సులిన్ ను అందిస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి ప్రాణాంతక రోగాలతో సైతం ఫ్లాక్స్ సీడ్స్ పోరాడతాయి.
బేవరేజెస్
బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు గ్రీన్ టీ, కాఫీ, ప్రోటీన్ షేక్స్ లాంటి పానీయాలు తీసుకోవడం ఉత్తమం.