Nail Biting Habit Disadvantages: గోళ్లను అదేపనిగా కొరికేస్తున్నారా, అయితే ప్రమాదంలో పడట్టే, ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం, ఈ అలవాటు నుంచి బయటపడే చిట్కాలు ఇవే..

ఎదుటి వారు ఏం చెబుతున్నా పట్టించుకోరు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గడం మాట ఎలా ఉన్నా.. గోళ్లకు, దంతాలకు నష్టం వాటిల్లుతుంది.

representational image (Photo Credits: Max Pixel)

సామాన్యంగా అందరూ ఒత్తిడిలో ఉన్నప్పుడు గోళ్లను ఎక్కువగా కొరుకుతుంటారు. ఆ కాసేపు కొరకడం ఆపేసినా తర్వాత మళ్లీ మామూలే. ఇంకా కొందరు ఆఫీస్‌లో ఉన్నా, టీవీ చూస్తున్నా అసంకల్పితంగా గోళ్లు కొరుకుతుంటారు. ఎదుటి వారు ఏం చెబుతున్నా పట్టించుకోరు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గడం మాట ఎలా ఉన్నా.. గోళ్లకు, దంతాలకు నష్టం వాటిల్లుతుంది. చేతులు పరిశుభ్రంగా కడుక్కోకపోతే రోగాల బారిన పడే అవకాశాలు పెరుగుతాయి. ఈ అలవాటును కొన్ని సింపుల్ టిప్స్‌తో మానేసుకోవచ్చు అదెలాగో చూద్దాం, గోళ్లను కొరికే అలవాటు మానుకోవాలంటే ముందుగా చేయాల్సింది వాటిని కత్తిరించుకోవడం. గోళ్లు పొట్టిగా ఉండటం వల్ల కొరకడానికి వీలు కాదు. ఫలితంగా ఈ అలవాటు నుంచి బయటపడొచ్చు.

>> క్యాల్షియం లోపం కారణంగానూ గోళ్లు కొరకడం అలవాటు కావచ్చు. కాబట్టి ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోండి. పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవాలి.

>> ఏదైనా పని మీద ధ్యాస పెట్టండి. గోళ్లు కొరకాలని అనిపించినప్పుడు ఆలోచనలను దారి మళ్లించండి.

>> గోళ్లు కొరికే అలవాటు మానుకోవాలని బలంగా అనుకోండి. ఇదే విషయాన్ని ఫోన్‌లో రిమైండర్‌గా పెట్టుకోండి. ఆఫీసులో మీరు పని చేసే చోట నోట్ రాసి అతికించుకోండి. ఇది కొంత వరకూ ఫలితాన్ని ఇస్తుంది.

>> అమ్మాయిలైతే తరచుగా మెనిక్యూర్ చేయించుకుంటే సరిపోతుంది. అందంగా ఉన్న గోళ్లను కొరకాలని ఎవరికి అనిపిస్తుంది చెప్పండి.

>> ఇన్నీ చేసినా గోళ్లు కొరకాలని అనిపిస్తుంటే.. వేప ఆకులను పేస్టులా చేసి దాన్ని గోళ్లకు పూయండి లేదా మిరియాల పేస్టును రాయండి. ఒత్తిడితో ఉన్నా గోళ్లు కొరుకుతుంటారు. మీ విషయంలోనూ ఇదే కారణం అయితే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. యోగా, ప్రాణాయామం సాధన చేయండి.

>> చేతికి రిస్ట్‌బ్యాండ్ ధరించండి. గోళ్లు కొరకాలి అనిపించినప్పుడల్లా దాన్ని లాగి వదలండి. ఫలితంగా ఆ ఆలోచనలను విరమించుకుంటారు.