Health Tips: సహజసిద్ధంగా చెడు కొలెస్ట్రాల్‌ను ఇలా తగ్గించుకోండి, ఇవి ట్రై చేయండి, హార్ట్‌ ఎటాక్‌ నుండి బయటపడవచ్చు

దీని ఫితంగా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి, మారుతున్న జీవన విధానం కారణమేదైనా కొలెస్ట్రాల్ మాత్రం పెరిగిపోతూనే ఉంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకునేందుకు ట్యాబ్లెట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.

Natural ways to reduce cholesterol without medication(X)

Hyd, Aug 9:  చెడు కొలెస్ట్రాల్..ఇప్పుడు ఈ సమస్య అందరిని వేధిస్తోంది. దీని ఫితంగా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి, మారుతున్న జీవన విధానం కారణమేదైనా కొలెస్ట్రాల్ మాత్రం పెరిగిపోతూనే ఉంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకునేందుకు ట్యాబ్లెట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.

అయితే మన వంటింట్లోనే ఉండే వాటి ద్వారా సహజ సిద్ధంగానే చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టేవచ్చే. ఈ విషయం తెలియక చాలా మంది ఆస్పత్రుల చుట్టు ప్రదిక్షణలు చేస్తున్నారు. యాలకులతో జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తొలగిస్తుంది. అలాగే మిరపకాయలోని క్యాప్‌సైసిన్ క్యాలరీలను వేగంగా ఖర్చుచేస్తుంది. అలాగే కరివేపాకు...శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు, చెడుకొవ్వును ఊడ్చేస్తాయి ఇవి. కూరల్లో కలిపి తిన్నా సరే, లేకపోతే రోజూ పది కరివేపాకులతో జ్యూస్ చేసుకొని తాగినా మంచిదే.

వెల్లుల్లి కొలెస్ట్రాల్ కట్టడికి అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. శరీరంలోని కొవ్వును తగ్గించేందుకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. అందుకే ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్‌గా వెల్లుల్లిని పిలుస్తారు. బత్తాయిలో ఉన్న పోషక విలువ విలువల గురించి తెలిస్తే షాక్ అవుతారు. 

రోజు ఉదయాన్నే తేనేతో కలిపి వెల్లుల్లి రెబ్బల్ని తింటే మంచి ఫలితం ఉంటుంది. బరువును తగ్గించేందుకు క్యాబేజీ చక్కగా పనిచేస్తుంది. ఉడికించిన క్యాబేజీ కూరలు తింటేనే శరీరానికి ఎంతో మేలు. రాగులు, జొన్న, గోధుమలను ఎక్కువగా వాడితే తక్కువ కొలెస్ట్రాల్‌తోపాటు ఎక్కువ ఫైబర్ లభిస్తుంది. సజ్జలతో చేసిన రొట్టెలు తింటే కొవ్వు రాకుండా జాగ్రత్త పడవచ్చు.

అలాగే సైక్లింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ వంటి వ్యాయామ చర్యలు ప్రతిరోజూ చేస్తే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బీన్స్, పుట్టగొడుగులు కూడా మనశరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి. అందువల్ల వేగంగా శరీరంలో కొవ్వు శాతం అధికంగా ఉన్న వాళ్ళు .. ప్రతిరోజూ ఆహార దినచర్యలో వీటిని చేర్చుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.