Image used for representational purpose. | (Photo Credits: Pixabay)

విత్తనాలను మొలకెత్తించి వాడటం వల్ల మన ఆరోగ్య పోషణకు దోహదచేస్తాయి. వీటిని మన ఆహారంలో కలిపి తీసుకోవాలి. విత్తనాన్ని మొలకెత్తిస్తే దానిలోని ఎంజైములు చైతన్యవంతమై ఎన్నో మార్పులను తీసుకువచ్చి గింజలోని పోషకాలు మన శరీరానికి సులభంగా లభ్యమయ్యే రూపంలోకి మార్చటమే గాక కొన్ని పోషకాలను సృష్టిస్తాయి. మన ఆహారంలో సాధారణంగా వాడే ధాన్యాలు, పప్పులను, మొలకెత్తిస్తే వాటిలోని పోషక విలువలు ఎక్కువగా వుంటాయి. పప్పులు, ధాన్యలలో మాంసకృత్తులు వుంటాయి. మొలకెత్తినప్పుడు నీటిలోని మాంసకృత్తులలో మార్పువచ్చి నాణ్యత పెరుగుతుంది. మాంసకృత్తులు అమైనో ఆమ్లాలుగా విభజంచబడి అత్యవసర ఆమైనో ఆమ్లాల నిష్పత్తిలో ఉపయోగకరమైన మార్పు వస్తుంది. ఈ విధంగా మాంసకృత్తులు శరీరంలో సులభంగా జీర్ణమై శరీర పోషణకు తోడ్పడతాయి.

మెులకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల ఉపయోగాలు:

>> మెులకెత్తిన గింజలు తినడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచచ్చు. వాటిలో ఉండే విటమిన్లు,ఖనిజాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. కావున మీ రోజువారి ఆహార ప్రణాళికలో మెులకెత్తిన గింజలను చేర్చండి.

>> మొలకెత్తిన గింజల్లో ప్రోటీన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, ఫోలేట్, విటమిన్ సి విటమిన్ కె లాంటి అద్భుతమైన పోషకాలు ఉంటాయి. అలాగే వాటిలోయాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాల సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. మొలకెత్తిన గింజలలో ఉండే ప్రోటీను నిల్వలు సులభంగా జీర్ణమవుతాయి. వీటి వల్ల పోషకాలను శరీరం సులభంగా గ్రహించేలా చేస్తుంది.

>> జీర్ణక్రియ మెరుగుపడుతుంది: మొలకెత్తిన గింజలు అధిక మొత్తాలలో సజీవ ఎంజైములను కలిగి ఉంటాయి. ఇవి జీర్ణక్రియను పెంచి శరీరంలోని రసాయనిక చర్యలను మెరుగుపరచడంలో సహకరిస్తాయి.వాటిలో్ ఎంజైములు ఆహారంలోని పోషకాల శోషించేందుకు ఉపయోగపడుతాయి. మలబద్ధకాన్ని నివారిస్తుంది

>> గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది: మొలకెత్తిన గింజలను తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీని ద్వారా గుండె నొప్పిలాంటి సమస్యలు ఉండవు. వాటిలో ఉండే ఫైటోఎరోజెన్ నిల్వలు , గుండె ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయి.



సంబంధిత వార్తలు

Health Tips: మీరు పైల్స్‌తో బాధపడుతుంటే ఈ తొమ్మిది రకాల ఆహారాలు బంద్ చేయండి, మొలలు వ్యాధి ఉన్నవారు దూరంగా ఉండాల్సిన పదార్థాలు ఇవే..

Bay Leaf Water on Empty Stomach: బిర్యానీ ఆకు సువాసనకే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిదే.. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో బిర్యానీ ఆకు నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి!

Ash Gourd Juice: రోజూ ఒక గ్లాసు బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగండి.. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిచడం మొదలుకొని, ఆరోగ్యకరమైన బరువును అందించడ వరకు ఎన్నో ప్రయోజనాలు, వివరంగా ఇక్కడ తెలుసుకోండి

Fenugreek Health Benefits: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు మెంతినీరు తాగండి, దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి!

Green Peas Health Benefits: షుగర్ కంట్రోల్ అవ్వాలంటే, గుండె ఆరోగ్యం మెరుగుపడాలంటే.. పచ్చిబఠానీలు తినండి, వీటి ఆరోగ్య ప్రయోజనాలు వేరే లెవెల్!

Health Tips: అరటి పండు వల్ల కలిగే లాభాలు తెలిస్తే మీరు రోజూ తినకుండా ఉండలేరు..

Health Tips: ఈ రకం చాక్లెట్ తింటే మీకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలిస్తే షాక్ తినడం ఖాయం..

Heath Tips: జామకాయలో ఉన్న ఈ అద్భుతమైన గుణాలు తెలిస్తే మీరు డాక్టర్ దగ్గరకు వెళ్లరు...