Tips to Viral Fever, Soar Throat: వైరల్ ఫీవర్, గొంతునొప్పి ఉందా? ఈ టిప్స్ పాటించండి చాలు! వేలకు వేలు ఆస్పత్రుల్లో ఖర్చు చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ చిట్కాలతో ఉపశమనం ఖాయం
ఈ రకమైన వైరస్ లు (virus) ఎక్కువగా ముక్కు, నోరు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. గొంతులోకి చేరి నొప్పికి దారి తీస్తాయి. శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే గోరు వెచ్చనీటిలో (hot water) ఉప్పు కలుపుకుని పుక్కిలించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
Hyderabad, July 25: వర్షకాలంలో వచ్చే ప్రధాన సమస్యల్లో వైరల్ ఫీవర్ (viral fever), గొంతునొప్పి (Throat Problem ) వంటివి ఉంటాయి. కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవటం ద్వారా వీటి బారిన పడాల్సి వస్తుంది. అదే క్రమంలో ప్రస్తుతం ఒమిక్రాన్ కారణంగా కూడా ఇలాంటి సమస్యలే ఎదుర్కోవాల్సి వస్తుంది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు తరచూ వైరల్ ఫీవర్, గొంతు నొప్పి (Throat Problem ) సమస్యల బారిన పడుతుంటారు. వర్షకాలం తేమ ద్వారా ఈ తరహా వైరల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందుతాయి. ఈ రకమైన వైరస్ లు (virus) ఎక్కువగా ముక్కు, నోరు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. గొంతులోకి చేరి నొప్పికి దారి తీస్తాయి. శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే గోరు వెచ్చనీటిలో (hot water) ఉప్పు కలుపుకుని పుక్కిలించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ప్రస్తుతం మెడికల్ షాపుల్లో అందుబాటులో ఉన్న బాటాడిన్ (Batadin) ద్రావణం సైతం ఇందుకోసం ఉపయోగించవచ్చు. అదే సమయంలో శరీరంలోని రోగనిరోధక వ్యవస్ధ వైరస్ లపై పోరాడుతున్న సందర్భంలో శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీని వల్ల జ్వరం వస్తుంది. 100 కంటే ఉష్ణోగ్రత అధికంగా ఉంటే వైద్యులను సంప్రదించి అందుకు తగిన మెడిసిన్స్ తీసుకోవటం మంచిది.
గొంతు నొప్పి నుండి ఉపశమనం కలగేందుకు అల్లం టీ, గ్రీన్ టీ(green tea), పసుపుతో ఆవిరి పెట్టటం వంటివి చేయాలి. వేడి నీరు తాగటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. గొంతునొప్పి ఉంటే పుల్లటి పండ్లు, పెరుగు(curd), సోడాలు వంటివి తీసుకోకపోవటం మంచిది. సూప్‌లు, ప్రొటీన్లతో కూడిన ఆహారం తీసుకోవాలి. నిద్రకుముందుగా పసుపు, మిరియాలు కలిపిన పాలు తాగాలి. వేడి నీళ్లలో తేనె కలుపుకుని తాగటం, తేలకపాటి భోజనం తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సమయంలో తగిన విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. పరిస్ధితి ఏమాత్రం ఇబ్బంది కరంగా మారినా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.