Talc Cancer Link: టాల్కం పౌడర్‌ తో అండాశయ క్యాన్సర్‌.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ క్యాన్సర్‌ (ఐఏఆర్‌సీ) ఈ మేరకు వెల్లడించింది.

Talcum Powder (Credits: X)

Newdelhi, July 7: ముఖానికి రోజూ పూసుకునే టాల్కం పౌడర్‌ (Talc Powder) వాడటం వల్ల క్యాన్సర్‌ (Cancer) వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ క్యాన్సర్‌ (ఐఏఆర్‌సీ) ఈ మేరకు వెల్లడించింది. మనుషుల్లో అండాశయ క్యాన్సర్‌ కు టాల్కం పౌడర్‌ కారణమవుతుందని చెప్పడానికి ఆధారాలు పరిమితంగా ఉన్నాయని తెలిపింది. ఎలుకల్లో చేసిన ప్రయోగాల్లో ఈ విషయం తేలినట్టు వెల్లడించింది.

కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీ కొట్టిన బైక్‌, అన్న మృతి చెందగా చెల్లెలికి గాయాలు

బలమైన ఆధారాలు  

టాల్కం వల్ల మనుషుల కణాల్లో క్యాన్సర్‌ సంకేతాలకు సంబంధించిన బలమైన ఆధారాలు ఉన్నాయని, జననాంగాలపై టాల్కం పౌడర్‌ను రాసుకునే మహిళల్లో అండాశయ క్యాన్సర్‌ రేటు పెరుగుతున్నట్లు అనేక అధ్యయనాలు వెల్లడించినట్టు ఐఏఆర్‌సీ గుర్తు చేసింది.

ఉపాధ్యాయ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు టెట్... జూన్‌ లో ఓసారి, డిసెంబర్‌ లో మరోసారి నిర్వహణ.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం