Hyderabad, July 7: ఏడాదికి రెండు సార్లు టెట్ (TET) (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు (Telangana Government) నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ శనివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏటా జూన్ లో ఓసారి, డిసెంబర్ లో మరోసారి టెట్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఒక అభ్యర్థి ఎన్నిసార్లు అయినా టెట్ పరీక్ష రాయవచ్చునని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టెట్ లో ఉత్తీర్ణత సాధించిన వారికే డీఎస్సీ రాయడానికి అవకాశం ఉంటుంది. టెట్ మార్కులకు డీఎస్సీలో వెయిటేజీ కూడా ఇస్తారు. గతంలో, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ప్రతి సంవత్సరం రెండుసార్లు టెట్ నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం టెట్ గడువును జీవితకాలానికి పెంచింది. దీంతో ఒక్కసారి క్వాలిఫై అయితే, మరోసారి రాయాల్సిన అవసరం లేదు.
టెట్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇకపై ఏడాదికి రెండుసార్లు టెట్ నిర్వహణ.. జూన్, డిసెంబర్ నెలల్లో రెండు సార్లు టెట్ పరీక్షలు. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం pic.twitter.com/tIlvMkgvgm
— Telugu Scribe (@TeluguScribe) July 6, 2024
గతంలో ఇలా..
గతంలో ఏటా ఒక్కసారి మాత్రమే టెట్ నిర్వహిస్తామని 2015లో అప్పటి కేసీఆర్ సర్కారు జీఓ 36 జారీ చేసినా ఇప్పటి వరకు ఐదుసార్లు మాత్రమే పరీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2016, 2017లో టెట్ నిర్వహించారు. అనంతరం 2018 నుంచి 2021 వరకు టెట్ ఊసే లేదు. మళ్లీ 2022, 2023లో వరుసగా టెట్ నిర్వహించారు.