
Newdelhi, Feb 18: కూరగాయలు తినడం (Eating Vegetables) ఆరోగ్యానికి (Health) మంచిది అని తెలుసు. అయితే, రోజూ కూరగాయలు తినటం ద్వారా కాలేయ క్యాన్సర్ ముప్పును (Liver Cancer) 65శాతం వరకు అడ్డుకోవచ్చని తెలుసా? ఈ మేరకు ఫ్రెంచ్ సైంటిస్టుల అధ్యయనం ఒకటి తాజాగా తేల్చింది. కూరగాయలు, పండ్లు తినటం వల్ల ఏమైనా లాభముందా? అని 179 మంది లివర్ క్యాన్సర్ రోగులపై ఫ్రెంచ్ సైంటిస్టులు అధ్యయనం చేశారు. రోజూ అదనంగా 240 గ్రాముల కూరగాయలు తినటం ద్వారా రోగుల్లో క్యాన్సర్ తగ్గుదల 65 శాతం వరకు కనపడిందని పరిశోధనలో తేలింది.
తిరుమల శ్రీవారిని దర్శించాలనుకునే భక్తులకు అలర్ట్.. మే నెలకు సంబంధించి కోటా వివరాలు ఇవిగో..!
ఏటా కోటి మంది ప్రాణాలు ఫట్
హృదయ సంబంధిత సమస్యలు ఉన్న వాళ్లల్లో కలిగే శారీరక మార్పులు క్యాన్సర్ ముప్పును మరింత పెంచుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బు కారణంగా శరీరంలో దీర్ఘకాలం పాటు ఇన్ ఫ్లమేషన్ కొనసాగుతుంది. ఇది కణాలు, వాటి డీఎన్ఏలో ప్రమాదకరమైన మార్పులు చేసి క్యాన్సర్ ముప్పును పెంచుతుంది. లివర్, లంగ్స్, కొలాన్‌పై ఈ ప్రభావం ఎక్కువ. కాగా ప్రపంచాన్ని శరవేగంగా కబళిస్తున్న వాటిలో క్యాన్సర్ ఒకటి. ఇటీవలి కాలంలో వయసు తారతమ్యం లేకుండా అందరూ దాని బారినపడుతున్నారు. ఏటా దాదాపు కోటి మంది ప్రాణాలు కోల్పోతున్నారు.