
Bengaluru, Mar 2: పచ్చ బొట్లతో (Tattoos) చర్మ వ్యాధులు, చర్మ క్యాన్సర్ (Cancer), హెపటైటిస్-బీ, సీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో పాటు హెచ్‌ఐవీ కూడా సంక్రమించే ప్రమాదముందని కర్ణాటక ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం పచ్చబొట్ల(టాటూ) పార్లర్లపై నియంత్రణ చర్యలకు సిద్ధమైంది. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా టాటూ పార్లర్లు నిర్వహించడం వల్ల పలు రోగాలు వస్తాయని హెచ్చరించింది. సరైన ఆరోగ్య చర్యలు, నిబంధనలు పాటించని టాటూ పార్లర్లపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం ప్రభుత్వ హెచ్చరికలు సంచలనంగా మారాయి. కాగా ఇటీవల టాటూ ట్రెండ్ విపరీతంగా పెరిగిపోవడం తెలిసిందే.
రెండు బస్సులు ఢీ.. 37 మంది దుర్మరణం.. మరో 39 మందికి గాయాలు.. బొలీవియాలో ఘోర ప్రమాదం
Tattoo: ರಾಜ್ಯದಲ್ಲಿ ಟ್ಯಾಟೂಗೆ ಬೀಳುತ್ತಾ ಕಡಿವಾಣ? | ಟ್ಯಾಟೂನಿಂದ HIV, ಚರ್ಮದ ಕ್ಯಾನ್ಸರ್ ಆತಂಕ
Full Video Link►https://t.co/8xWwalFREd#TV9Kannada #TattooLover #TattooBan #KarnatakaGovt #HealthDepartment #HIV #SkinDiseases #KannadaNews #LatestNews pic.twitter.com/BlACO9REtJ
— TV9 Kannada (@tv9kannada) February 28, 2025
నిబంధనలు అవసరం
ప్రస్తుతం టాటూ పార్లర్లపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా చట్టాలేమీ లేకపోవడంతో నియంత్రణ కొరవడింది. డ్రగ్స్ లేదా కాస్మెటిక్స్ చట్టం పరిధిలోకి రాని లోహాలను వినియోగిస్తూ టాటూలు వేస్తున్నట్టు ఆరోగ్య మంత్రి దినేశ్ గుండురావు తెలిపారు. అపరిశుభ్రత, ప్రమాదకరమైన రసాయనాల వినియోగంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. కాబట్టి టాటూ పార్లర్లపై తప్పనిసరిగా మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరముందని స్పష్టం చేశారు.
చర్చి పండుగలో విషాదం… కరెంట్ షాక్ తో నలుగురు యువకులు మృతి.. తమిళనాడులో ఘటన (వీడియో)