
Newdelhi, Mar 2: బొలీవియాలోని (Bolivia) పొటోసీ ప్రాంతంలో రెండు బస్సులు ఢీకొన్నాయి (Bus Accident). ఈ ఘోర ప్రమాదంలో 37 మంది మరణించారు. మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉయుని, కొల్చాని రహదారిపై ప్రయాణిస్తున్న రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు వెల్లడించారు. ప్రమాద తీవ్రతకు ఒక బస్సు లోయలోకి దూసుకెళ్లింది. మరో బస్సు తుక్కుతుక్కు అయ్యింది.
రంగారెడ్డి రవాణా శాఖ కార్యాలయంలో ఫ్యాన్సీ నెంబర్ల వేలం.. ఒక్క రోజులోనే రవాణా శాఖకు రూ.37 లక్షల ఆదాయం
At least 37 dead and dozens injured in bus crash in Bolivia https://t.co/rBprWpAAd2 pic.twitter.com/djVoVMFn86
— Reuters World (@ReutersWorld) March 2, 2025
ప్రమాదానికి కారణం ఇదే..
అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం అందిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
చర్చి పండుగలో విషాదం… కరెంట్ షాక్ తో నలుగురు యువకులు మృతి.. తమిళనాడులో ఘటన (వీడియో)