Chennai, Mar 2: తమిళనాడులోని (Tamil Nadu Horror) కన్యాకుమారి ప్రాంతంలో ఘోరం జరిగింది. చర్చి (Church) పండుగలో పెను విషాదం చోటుచేసుకుంది. ఎనాయం పుత్తేంతురైలో సెయింట్ ఆంథోనీ చర్చిలో ఉత్సవాలు జరుగుతుండగా కరెంట్ షాక్ తగిలి నలుగురు యువకులు ఘటనా స్థలంలోనే మృత్యువాతపడ్డారు. ప్రత్యేకంగా తయారు చేసిన రథాన్ని ఉరేగిస్తున్న సమయంలో డెకరేషన్ చేయడానికి ఇనుప నిచ్చెన తీసుకొస్తుండగా, అది విద్యుత్ వైర్లకు తగలడంతో ప్రమాదం జరిగింది.  విద్యుత్ షాక్ కొట్టడంతో నలుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఆంటోనీ, శోభన్, మరియా విజయన్, మైఖేల్ పింటో అని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నేటి నుంచి రంజాన్ మాసం... ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్, లోకేశ్

Here's Video:

వారంలో రెండు ఘటనలు

తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలే ఇటీవల చోటుచేసుకున్నాయి. వారం కిందట గుంటూరు జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. పెదకాకాని కాళీ గార్డెన్స్ రోడ్డులో ఉన్న ఓ గోశాలలో విద్యుదాఘాతంతో నలుగురు మృతిచెందారు. సంపులో పూడికను తొలగించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. అంతకుముందు తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా పెగడాపల్లి గ్రామ శివారులోని పంట పొలంలోనూ కరెంట్ షాక్ ఘటన చోటుచేసుకుంది. పొలంలో అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు తగిలి భార్యాభర్తలతో పాటుగా వారి కుమారుడు కుప్పుకూలిపోయి అక్కడికక్కడే మరణించారు.

నిత్యం రద్దీగా ఉండేలా వరంగల్ ఎయిర్‌పోర్టు డిజైన్‌, భూసేకరణ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశం