Chandrababu-Jagan-Lokesh (Credits: X)

Vijayawada, Mar 2: ముస్లిం సోదరులు పరమ పవిత్రంగా భావించే రంజాన్ మాసం (Ramadan 2025 Wishes) నేటి నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chandrababu Naidu), వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేశ్ తదితరులు 'ఎక్స్' వేదికగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ముస్లిం సోదరులకు రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలతో మీరు చేసే ప్రార్థనలు ఫలించాలని.. ఆ అల్లా దయతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు. ‘పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు. ఉపవాస దీక్షలు చేస్తున్న అందరికీ అల్లా దీవెనలు  మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.

నిత్యం రద్దీగా ఉండేలా వరంగల్ ఎయిర్‌పోర్టు డిజైన్‌, భూసేకరణ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశం

రంజాన్ చాంద్ ముబారక్

రంజాన్ చాంద్ ముబారక్ అంటూ నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘రంజాన్ చాంద్ ముబారక్. నెల వంక క‌నిపించింది. ప‌విత్ర రంజాన్ మాసం ఆరంభ‌మైంది. నెలంతా ఉప‌వాసాలు, ప‌విత్ర ఖురాన్ ప‌ఠ‌నం, త‌రావీ న‌మాజ్ భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో చేప‌ట్టే ముస్లిం సోద‌ర‌సోద‌రీమ‌ణుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను.  అల్లా ద‌య‌తో క్ర‌మ‌శిక్ష‌ణ‌, శాంతి, స‌హ‌నం, దాన గుణంతో కఠోర ఉప‌వాస దీక్ష‌లు సాగాల‌ని దేవుడిని ప్రార్థిస్తున్నాం’ అంటూ లోకేశ్ పేర్కొన్నారు.

భుజంపై చిలుక..హెల్మెట్‌ లేకుండా లేకుండా బైక్ నడుపుతున్న యువతి, బెంగళూరులో వైరల్‌గా మారిన వీడియో