
Hyderabad, March 01: మామునూరు విమానాశ్రయం (Warangal Airport) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్టుపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) శనివారం సమీక్ష నిర్వహించారు. భూసేకరణ, పెండింగ్ పనుల వివరాలు ఆరా తీశారు. కేరళలోని కొచ్చి విమానాశ్రయం తరహాలో మామునూరు విమానాశ్రయం ఉండాలని సూచించారు. నిత్యం యాక్టివిటీ ఉండేలా ఎయిర్‌పోర్టు డిజైన్ చేయాలన్నారు. విమానాశ్రయానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.
CM Revanth Reddy Review on Warangal Airport
వరంగల్ మామునూరు విమానాశ్రయం కేరళ కొచ్చి విమానాశ్రయం తరహాలో ఉండాలని, ప్రతి నిత్యం రాకపోకలతో విమానాశ్రయంలో కార్యకలాపాలు జరిగేలా డిజైన్ రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి @revanth_anumula గారు అధికారులకు సూచించారు. వరంగల్ నగరానికి విమానాశ్రయం ఎక అసెట్ గా ప్రతిష్టాత్మకంగా నిర్మాణం ఉండాలని… pic.twitter.com/cs9zBYezVI
— Telangana CMO (@TelanganaCMO) March 1, 2025
పనులకు సంబంధించి ప్రతీ నెలా రిపోర్టు అందించాలని చెప్పారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీహరి, ప్రకాశ్‌రెడ్డి, నాగరాజు, మేయర్ సుధారాణి, సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, శ్రీనివాసరాజు హాజరయ్యారు.