
Hyderabad, Mar 2: వాహనాల ఫ్యాన్సీ నంబర్లు (Fancy Number Auction In Hyderabad) రవాణా శాఖకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎంత ధర అయినా సరే కొనాల్సిందే అంటున్నారు పలువురు ఆశావహులు. ఆన్ లైన్ లో ఫ్యాన్సీ నంబర్లు (Fancy Numbers) లక్షల రూపాయలు పలుకుతున్నాయి. సెలబ్రిటీలు, రాజకీయనేతలు మాత్రమే కాదు సాధారణ ప్రజలు సైతం ఫ్యాన్సీ నంబర్ల కోసం తాపత్రయపడుతున్నారు. దీంతో డిమాండ్ భారీగా పెరిగిపోతుంది. ఫ్యాన్సీ నంబర్లపై రోజురోజుకు క్రేజీ పెరిగిపోతుంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, అదృష్ట సంఖ్య ఇలా తమ జీవితంలో ముఖ్యమైన నంబర్లను (ఫ్యాన్సీ) వాహనదారులు లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. కొందరు ప్రత్యేకమైన నంబర్ ను హోదాగా భావించడం, మరికొందరు న్యూమరాలజీని నమ్మి ఆ నంబర్ తో తమకు అంతా కలసివస్తుందనుకునేవారు ఇలా ఇలా ఏది ఏమైనా తమ వాహనానికి మాత్రం ఫ్యాన్సీ నంబర్ నంబర్ ఖచ్చితంగా ఉండాల్సిందే అని అనుకుంటున్నారు. దీంతో పోటీ భారీగా పెరిగిపోతుంది. అదికాస్త నంబర్ కొనుగోలుపై ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం ఫ్యాన్సీ నంబర్ల ట్రెండ్ కొనసాగుతుంది. దీంతో ఫ్యాన్సీ నంబర్ల క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఒక్కో నంబర్ లక్షల రూపాయలు పలుకుతుంది. ధర ఎంతైనా చెల్లించి ఫ్యాన్సీ నంబర్ ను వాహనదారులు సొంతం చేసుకుంటున్నారు. ముఖ్యంగా 1,6,9,99,999,9999 నంబర్లకు భారీగా డిమాండ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎక్కువ మంది వాహనదారులు తమ వాహన నంబర్ ప్రారంభం నుంచి చివరి వరకు క్రమేపీ పెరుగుతూ పోవాలని కూడా కోరుకుంటున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. తద్వారా సాధారణ నంబర్లకు కూడా డిమాండ్ పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
చర్చి పండుగలో విషాదం… కరెంట్ షాక్ తో నలుగురు యువకులు మృతి.. తమిళనాడులో ఘటన (వీడియో)
రంగారెడ్డి రవాణా శాఖ కార్యాలయంలో ఫ్యాన్సీ నెంబర్ల వేలం..
TG07 P 9999 ఫ్యాన్సీ నెంబర్ కు. రూ. 9.37 లక్షలు
TG07 P 0009 ఫ్యాన్సీ నెంబర్ రూ.7.50 లక్షలు
ఒక్క రోజులోనే రవాణా శాఖకు రూ.37 లక్షల ఆదాయం pic.twitter.com/nCYFaKArg3
— BIG TV Breaking News (@bigtvtelugu) March 2, 2025
రంగారెడ్డిలో ఫ్యాన్సీ నెంబర్ల వేలం
హైదరాబాద్ లోని మణికొండ లో రవాణా శాఖ కార్యాలయంలో నిర్వహించిన ఫ్యాన్సీ నెంబర్ల వేలానికి భారీ స్పందన వచ్చింది. శనివారం రవాణా శాఖ కార్యాలయంలో (ఆర్టీఓ) నిర్వహించిన వేలంలో ఔత్సాహికులు పాల్గొని ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసి నచ్చిన నెంబర్లను దక్కించుకున్నారు. TG07P9999 ఫ్యాన్సీ నెంబర్ రూ. 9 లక్షల 37 వేలు పలికింది. దీన్ని ముప్పా ప్రాజెక్ట్స్ అనే కంపెనీ దక్కించుకుంది. ఇక TG07P0009 ఫ్యాన్సీ నెంబర్.. రూ. 7 లక్షల 50 వేలు పలికింది. దీన్ని కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా టెక్ కంపెనీ చేజిక్కించుకుంది. ఈ ఒక్క రోజే రవాణా శాఖ కు ఫ్యాన్సీ నెంబర్ల రూపేనా అక్షరాల 37 లక్షల ఆదాయం సమకూరినట్టు సమాచారం.
నేటి నుంచి రంజాన్ మాసం... ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్, లోకేశ్
కాసుల వర్షం
ఫ్యాన్సీ నంబర్ల రవాణా శాఖకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఆదాయం వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 56 రవాణా శాఖ కార్యాలయాలుండగా.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే ఫ్యాన్సీ నంబర్లకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.90 కోట్ల వరకు ఆదాయం లభిస్తే గ్రేటర్ హైదరాబాద్ 3 జిల్లాల రవాణా శాఖ కార్యాలయాల్లో సుమారు రూ.74 కోట్లు ఆదాయం సమకూరడం విశేషం. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.100 కోట్లకు చేరుకునే అవకాశముందని రవాణాశాఖ అధికారులు అంచన వేస్తున్నారు. సంపన్నలు అధికంగా ఉండే ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయ పరిధిలో ఫ్యాన్సీ నంబర్లకు డిమాండ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఈ కార్యాలయం సిరీస్ నంబరు 09 కావటంతో ఇక్కడి ఫ్యాన్సీ నంబర్లకు బాగా డిమాండ్. 1, 9, 99, 999, 9999 దక్కించుకునేందుకు వాహనదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సంవత్సరం 9999 నంబరుకు ఓ వాహనదారుడు వేలంలో రూ.25.5 లక్షలు వెచ్చించి నంబరును దక్కించుకున్నాడు.
ఫీజు ఇలా..
ఫ్యాన్సీ నంబర్ల కోసం వేలంలో పాల్గొనేందుకు గరిష్ఠ మొత్తం రూ.50 వేలు, కనిష్ఠంగా రూ.5వేలు ఫీజుగా తీసుకుంటున్నారు. ఈ ఫీజు రూపంలో చెల్లించే మొత్తం కన్నా వేలం ద్వారా వచ్చిన అధిక మొత్తం ప్రభుత్వ ఖజానాకు జమ కావడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్ లో ప్రత్యేక నంబర్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 73,463. ఫీజు రూపంలో రూ.32.57 కోట్లు వస్తే, వేలం ద్వారా ప్రభుత్వానికి అదనంగా సమకూరిన మొత్తం రూ.40.99 కోట్లు.