Health Tips: దాల్చిన చెక్కను ఇలా ఉపయోగిస్తే...అమ్మాయిల మొహం మీద ఒక్క మొటిమ కూడా కనిపించదు..

మరసటి ఉదయం గోరువెచ్చని నీటితో కడిగేయాలి . ఇలా ప్రతిరోజు చేయడం వలన మొటిమలు సమస్యను తగ్గించుకోవచ్చు.

Cinnamon (Credits: X)

దాల్చిన చెక్క మన వంట ఇంట్లో ఉండే మసాల దినుసుల్లో ఇది ఒకటి.అయితే దీనివల్ల మనకు ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు.దీనిగురించి ఇప్పుడు తెలుసుకుందామా.. పొట్ట దగ్గర ఉన్న కొవ్వును కరిగించాలంటే కప్పు నీటిని వేడిచేసి అందులో అరటీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలపాలి. ఆ నీరుని చల్లబర్చి దానిలో కొంచెం తేనె కలిపి రోజు తీసుకుంటు ఉండాలి. అదే విధంగా దాల్చిన చెక్క ఆకలిని తగ్గించడమే కాకుండా రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

అలాగే జీవక్రియను వేగవంతం చేయడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దాల్చిన చెక్క, శొంఠి, యాలకులు, సైంధవ లవణ చూర్ణాలను గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే అజీర్ణసమస్యలు, కడుపు ఉబ్బరం లాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

దాల్చిన చెక్క, పసుపు, పొడపత్రి, నల్లజీలకర్ర చూర్ణాలను సమానంగా కలిపి పెట్టుకోవాలి. వీటిని అరచెంచా పొడిని పావు గ్లాసు నీరు లేదా పాల్లలో కలిపి తాగితే మధుమేహా సమస్యను నియంత్రణలో ఉంచుతుంది. అలాగే గ్రాము దాల్చిన చెక్క పొడిని సరైన మోతాదులో తీసుకొని అందులో తేనె కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటే జలుబు, దగ్గు సమస్యలని నివారించవచ్చు.

మొటిమలు సమస్య తగ్గేందుకు ఒక భాగం దాల్చిన చెక్క చూర్ణాన్ని మూడవ వంతు తేనె కలిపి ఆ మిశ్రమాన్ని రాత్రి పూటా ముఖానికి రాసుకొని అలానే రాత్రంతా ఉంచుకుని.. మరసటి ఉదయం గోరువెచ్చని నీటితో కడిగేయాలి . ఇలా ప్రతిరోజు చేయడం వలన మొటిమలు సమస్యను తగ్గించుకోవచ్చు.

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి