Ratha Saptami: నేడు రథసప్తమి.. భక్తజన సంద్రంగా అరసవల్లి.. గత రాత్రి నుంచే ఆలయానికి చేరుకుంటున్న భక్తులు

రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యభగవానుడి నిజరూప దర్శనాన్ని కనులారా వీక్షించాలని గత రాత్రే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు.

Credits: Twitter

Srikakulam, Jan 28: శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లి (Arasavilli) భక్త జనసంద్రంగా మారింది. రథసప్తమి (Ratha Saptami) పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యభగవానుడి (Surya Bhagavan) నిజరూప దర్శనాన్ని కనులారా వీక్షించాలని గత రాత్రే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. దర్శనం కోసం క్యూలలో వేచి చూశారు. మరోవైపు, అర్ధరాత్రి దాటిన తర్వాత రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ఇతర ప్రముఖులు ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు.

బీఆర్‌ఎస్‌ లో చేరిన ఒడిశా మాజీ సీఎం, కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ కండువా కప్పుకున్న గిరిధర్ గమాంగ్, 9 సార్లు లోక్‌ సభ సభ్యుడిగా గెలిచిన గమాంగ్

భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని ముందే ఊహించిన అధికారులు క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో పాటు వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. కాగా, నేడు సూర్యోదయం తర్వాత సూర్యుడి తొలి కిరణాలు నేరుగా స్వామి వారి పాదాలను తాకనున్నాయి. ఈ అపురూప క్షణాలను వీక్షించేందుకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో నగ్నంగా ఫోటోలు పంపిన 14 ఏళ్ల బాలిక, నాతో సెక్సీగా చాట్ చేయాలంటూ 17 ఏళ్ల బాలుడు బ్లాక్‌ మెయిల్‌, బాలిక తండ్రి ఫిర్యాదుతో అరెస్ట్ చేసిన పోలీసులు