Hyderabad, JAN 27: భారత్ రాష్ట్ర సమితికి (BRS) దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తుంది. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భవన్‌లో గిరిధర్‌కు సీఎం కేసీఆర్ (CM KCR) పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గిరిధర్‌తో (Giridar gamang) పాటు 12 మంది మాజీ ఎమ్మెల్యేలు, నలుగురు మాజీ ఎంపీలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్‌లో చేరిన వారిలో హేమ గమాంగ్, జయరాం పాంగీ (Jayaram pangi), రామచంద్ర హన్ష్‌డా, బృందావన్ మజ్హీ, నబీన్ నంద, రాథా దాస్, భగీరథి సేతి, మయదార్ జేనా ఉన్నారు. గిరిధర్ గమాంగ్ ఈ నెల 25న బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ కూడా బీజేపీకి రాజీనామా చేశారు. 2015లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఒడిశా రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ గిరిధర్ గమాంగ్‌కు ప్రత్యేకత ఉన్నది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గమాంగ్ సొంత రాష్ట్రం నుంచి 9 పర్యాయాలు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 1972 నుంచి 2004 దాకా వరుసగా కోరాపుట్, లక్ష్మీపూర్ స్థానాల నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999 ఫిబ్రవరి 17 నుంచి డిసెంబర్ 6 వరకు సుమారు 10 నెలలపాటు ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం వ్యవహారశైలి నచ్చక 2015లో ఆయన బీజేపీలో చేరారు. కాగా, గిరిధర్ సతీమణి హేమ గమాంగ్ 1999లో ఎంపీగా వ్యవహరించారు.
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గిరిధర్ గమాంగ్‌తో పాటు పలువురు నేతలకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. pic.twitter.com/yKh3FPXAzn
— BRS Party (@BRSparty) January 27, 2023
దేశంలోని అన్ని వర్గాలు సంతోషంగా ఉండేలా ఒక మహాన్ భారత్ నిర్మిద్దాం అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. సకల మానవాళి సంక్షేమమే బీఆర్ఎస్ స్వప్నం అని ఆయన స్పష్టం చేశారు. దేశ భవిష్యత్ కోసమే బీఆర్ఎస్ ఆవిర్భవించిందని తేల్చిచెప్పారు. దేశ భవిష్యత్‌ను మార్చే సంకల్పంతోనే బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించాం. ఈ మహా సంగ్రామంలోకలిసి వస్తున్న ఒడిశా రాష్ట్ర ప్రజలకు స్వాగతం. నవ నిర్మాణ్ కృషక్ సంఘటన్ కన్వీనర్ అక్షయ్ కుమార్ పార్టీలో చేరడం సంతోషకరం. ఎంతో దూరం నుంచి వ్యయప్రయాసాలకోర్చి వచ్చిన వారందరికి కేసీఆర్ స్వాగతం తెలిపారు. దేశంలోని క్రియాశీల నాయకుల్లో గమాంగ్ ఒకరు. రైతుల తరపున గమాంగ్ అనేక కార్యక్రమాలు చేపట్టారు. గమాంగ్ రాజకీయ జీవితం మచ్చలేనిది. గమాంగ్ చేరిక నాకు వెయ్యి
ఏనుగుల బలం లాంటిది అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఒడిశా మాజీ మంత్రి శివరాజ్ పాంగితో పాటు ఇతర నాయకులు హేమ గమాంగ, జయరామ్ పాంగి, రామచంద్ర హన్సద, బృందాబన్ మాఝి, నబిన్ నందా, రతా దాస్, భగీరథి సేతి, మయాధర్ జేనా తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. pic.twitter.com/5nPYVBeeoJ
— BRS Party (@BRSparty) January 27, 2023
అమెరికా, చైనా అభివృద్ధి చెందిన దేశాల కంటే వనరులు ఎక్కువ ఉన్నాయి. కానీ మన దేశం అభివృద్ధి చెందడం లేదు. భారత్ తన లక్ష్యాన్ని మరిచిందని పేర్కొన్నారు. దేశ యువత అమెరికా వెళ్లేందుకు తహతహలాడుతున్నారు. అమెరికా గ్రీన్ కార్డు వస్తే సంబురాలు చేసుకుంటున్నారు. దేశంలో సరిపడా నీళ్లున్నా పొలాలకు మళ్లవు, సరిపడా కరెంట్ ఉన్న చీకట్లు తొలగవు. ప్రభుత్వాలు మారినా రైతులు, కార్మికుల పరిస్థితి మారలేదు. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్
అన్నారు.
Let's build a Mahan Bharat so that all sections of the country are happy: BRS President, CM Sri KCR. pic.twitter.com/VP6i8OqWKr
— BRS Party (@BRSparty) January 27, 2023
ఎన్నికల్లో గెలవడమే నాయకులకు లక్ష్యంగా మారిందని కేసీఆర్ పేర్కొన్నారు. ఏదో రకంగా ఓట్లు సంపాదించుకోవడమే రివాజుగా మారింది. స్వాతంత్ర్యం ఇచ్చి 75 ఏండ్లు అవుతున్నప్పటికీ తాగడానికి నీళ్లు ఇవ్వట్లేదు. ఒడిశా మహానదిలో ఎంత శాతం నీళ్లను వాడుకుంటున్నా. ఈ 75 ఏండ్లలో మనం ఏం సాధించినట్టు? జాతి, ధర్మం పేరు చెప్పి గెలిచే వారు ఏం చేస్తారు? పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు.. కానీ తాగడానికి గుక్కెడు నీళ్లు ఇవ్వరని మండిపడ్డారు కేసీఆర్.
రైతులు దేశ రాజధాని సరిహద్దుల్లో 13 నెలల ఉద్యమం ఎందుకు చేశారు. ఇప్పటికీ రైతులకు ఒక భరోసా ఇవ్వలేకపోయింది కేంద్రం. అందుకే అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాన్ని ఎత్తుకున్నది బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపించండి.. దేశంలో నీళ్లు, కరెంట్ ఎందుకు రావో నేను చూస్తాను. మనసు పెట్టి పని చేస్తే ఏదైనా సాధ్యమే. తెలంగాణకు అందుకు సాక్ష్యం. తెలంగాణలో సాధ్యమైంది.. దేశమంతటా ఎందుకు సాధ్యం కాదు. తెలంగాణలో ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తున్నాం.. దేశమంతా ఎందుకు ఇవ్వలేం. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఆగిపోయాయి.. వలసలు వాపస్ వస్తున్నాయి.
నేను చెప్పేది ధన్ కీ బాత్ కాదు.. మన్ కీ బాత్. కరెంట్‌కు దేశంలో కొదవ లేదు.. 4 లక్షల మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉంది. అన్ని ధరలు పెంచుకుంటూ పోవాలి.. జనం జేబులు కొట్టేయాలనేదే కేంద్రం యావ. పేదోడి కడుపు కొట్టాలి.. ఉన్నోడి జేబులు నింపాలి.. దేశంలో నడుస్తున్నది ఇదే. రైతులు కూడా చట్టసభల్లోకి కూడా రావాలి. రైతులు నాగలి పట్టడమే కాదు.. రాజ్యాంగాన్ని నడిపే నాయకులుగా మారాలన్నారు కేసీఆర్.