Harsha Sai Case: యూట్యూబర్ హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్.. హర్షపై బాధితురాలి మరో ఫిర్యాదు.. ఈసారి ఏంటంటే?

ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. సామాజిక మాధ్యమాల్లో తనపై ట్రోలింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని హర్షసాయి బాధితురాలు కంప్లైంట్ ఇచ్చారు.

Complaint on Youtuber Harsha Sai (Credits: X)

Hyderabad, Oct 4: ప్రముఖ యూట్యూబర్​ హర్షసాయి (Harsha Sai Case) కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. సామాజిక మాధ్యమాల్లో తనపై ట్రోలింగ్ (Trolling)​ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని హర్షసాయి బాధితురాలు కంప్లైంట్ ఇచ్చారు. ఈ మేరకు  సైబరాబాద్​ సైబర్​ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచార బాధితురాలైన తనపై హర్షసాయి ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్​ చేయిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై ఈ విధంగా సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్​ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆమె కోరారు. తనపై జరుగుతున్న ట్రోలింగ్​పై పలు స్క్రీన్​ షాట్లను పోలీసులకు సమర్పించారు.

నేటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు... రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు.. ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు

ఏమిటీ కేసు?

బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హర్షసాయి తనపై లైంగిక దాడికి పాల్పడి, బెదిరింపులకు దిగుతున్నాడని నార్సింగి పోలీసులకు బాధితురాలు ఇటీవలే ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతుండగా, ట్రోలింగ్​ వ్యవహారంపై మరో ఫిర్యాదు రావడం గమనార్హం.

మంత్రాల నెపంతో మహిళ సజీవ దహనం.. మెదక్ జిల్లా రామాయంపేటలో ఘటన (వీడియో)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement