Medak, Oct 4: శాస్త్ర సాంకేతికత ఎంతగా అభివృద్ధి సాధించినప్పటికీ గ్రామాల్లో ఇంకా మూఢనమ్మకాలు పెద్దయెత్తున రాజ్యమేలుతున్నాయి. ఇదీ అలాంటి ఘటనే. మెదక్ (Medak) జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో దారుణం జరిగింది. మంత్రాలు చేస్తున్నదన్న (black magic) అనుమానంతో గ్రామానికి చెందిన డేగల ముత్తవ్వ అనే మహిళపై కొందరు వ్యక్తులు దాడికి తెగబడ్డారు. అంతటితో ఆగకుండా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. పరిస్థితిని గమనించిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని సమీప దవాఖానకు తరలించారు.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో దారుణం...
డేగల ముత్తవ్వ అనే మహిళపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగులు.
మంత్రాలు చేస్తుంది అనే అనుమానంతో దాడి జరిగినట్లు సమాచారం.
మహిళ పరిస్థితి విషమం ఆసుపత్రికి తరలించిన పోలీసులు.
చికిత్స పొందుతూ మహిళ మృతి. pic.twitter.com/xRaD9sdeIr
— ChotaNews (@ChotaNewsTelugu) October 4, 2024
ముగ్గురు అదుపులోకి
అయితే, అప్పటికే మహిళ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలించాలని నిర్ణయించారు. అయితే, దారిమధ్యలో ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకూ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్తా స్థానికంగా సంచలనంగా మారింది.