Snake In Amazon Order: ఆన్ లైన్ ఆర్డర్స్ చేస్తున్నారా? అయితే, జాగ్రత్త.. అమెజాన్ కొరియర్ లో కోబ్రా.. షాక్ తిన్న బెంగళూరు దంపతులు.. వీడియో వైరల్

బిజీ లైఫ్ కారణంగా ఆన్ లైన్‌ షాపింగ్ ఈమధ్య పెరిగిపోయింది. అయితే, ఇచ్చిన వస్తువు ప్లేస్ లో ఇంకో వస్తువు వచ్చిన ఘటనలు ఇప్పటికే చాలా చూశాం.

Snake In Amazon Order (Credits: X)

Bengaluru, June 19: బిజీ లైఫ్ (Busy Life) కారణంగా ఆన్ లైన్‌ షాపింగ్ (Online Shopping) ఈమధ్య పెరిగిపోయింది. అయితే, ఇచ్చిన వస్తువు ప్లేస్ లో ఇంకో వస్తువు వచ్చిన ఘటనలు ఇప్పటికే చాలా చూశాం. అయితే, ఇప్పుడు మీరు ఈ వార్త చదివాక ఆన్ లైన్ లో ఆర్డర్ చేయాలంటే భయపడే పరిస్థితి ఏర్పడొచ్చు. విషయంలోకి వెళ్తే.. బెంగళూర్‌ కు చెందిన దంపతులు ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌ లో ఎక్స్ బాక్స్ కంట్రోలర్ ఆర్డర్ చేశారు. మంగళవారం డెలివరీ వచ్చింది. తప్పుడు ఆర్డర్లు వస్తున్నాయన్న అనుమానంతో ఎందుకైనా మంచిదని ఆర్డర్ తీసే సమయంలో వీడియో తీశారు.  బాక్స్‌ ను ఓపెన్ చెయ్యగానే దాని టేప్ కు అతుక్కున్న పామును గుర్తించారు. దీంతో ఒక్కసారిగా షాక్ తిని భయపడ్డారు.

బైక్ అదుపుతప్పి కింద పడిపోయిన డెలివరీ బాయ్.. అప్పుడే వెనుకనుంచి దూసుకొచ్చిన మెర్సిడెస్ కారు.. మీద నుంచి పోవడంతో అక్కడికక్కడే మృతిచెందిన డెలివరీ బాయ్... పూణేలో ఘోరం (వీడియో)

టేపు కు అతుక్కోవడంతో

నాగు పాము టేపుకు అతుక్కొని ఉండటంతో అది బయటకు రాలేకపోయింది. దీంతో ఆ జంట ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే పరిస్థితి మరోలా ఉండేదని వాపోయారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటనపై స్పందించిన అమెజాన్ డెలివరీ సొమ్మును రీఫండ్ చేసి చేతులు దులుపుకున్నట్టు సదరు దంపతులు వాపోయారు.

వైసీపీ ఎంపీ బీద మస్తాన్‌ రావు కూతురు ర్యాష్ డ్రైవింగ్.. ఫుట్‌ పాత్‌ పైకి దూసుకెళ్లిన కారు.. నిద్రిస్తున్న యువకుడి మృతి.. నిందితురాలి అరెస్ట్.. అనంతరం బెయిల్ పై విడుదల

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement