Eid Milad Un Nabi 2024: మిలాద్ ఉన్ నబీ ఎందుకు జరుపుకుంటారు? ఈద్ మిలాద్-ఉన్-నబీ చరిత్ర ఏమిటీ, అల్లాహ్ విశ్వ శాంతి నిమిత్తం ఆఖరి ప్రవక్తగా మహమ్మద్ ను ఎంపిక చేసుకున్నారా..

మౌలిద్ లేదా మీలాద్ అనునది మహమ్మదు ప్రవక్త జన్మదినోత్సవం.అరబ్బీ భాషలో మౌలిద్ అంటే జన్మనివ్వడం అనే అర్థంలో వాడుతారు. ఆధ్యాత్మిక గురువులు ఔలియాల జన్మదినాన్ని గూడా 'మౌలిద్' గా జరుపుకుంటారు.

Eid-Mubarak-Wishes-in-Telugu

Eid Milad Un Nabi 2024: మౌలిద్ లేదా మీలాద్ అనునది మహమ్మదు ప్రవక్త జన్మదినోత్సవం.అరబ్బీ భాషలో మౌలిద్ అంటే జన్మనివ్వడం అనే అర్థంలో వాడుతారు. ఆధ్యాత్మిక గురువులు ఔలియాల జన్మదినాన్ని గూడా 'మౌలిద్' గా జరుపుకుంటారు. భారతదేశం సాధారణంగా జరుపుకొనే ఉరుసు ఉత్సవాలు ఈ కోవకు చెందినవే. ఇస్లామిక్ క్యాలెండర్లో మూడో నెల అయిన రబీ అల్-అవ్వాల్ నెలలో ఈ పండుగను (Eid Milad Un Nabi) జరుపుకుంటారు.

అనంత కరుణామయుడు అల్లాహ్ విశ్వ శాంతి నిమిత్తం ఆఖరి ప్రవక్తగా మహమ్మద్ ను (Prophet Muhammad) ఎంపిక చేసుకున్నట్లు ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే ఖురాన్ అనే గ్రంథంలో ఈ వివరాలు చెప్పబడ్డాయి. ఈ విశ్వ ప్రవక్త మహమ్మద్ కేవలం ముస్లిముల కోసం కాదని సకల కోటి జీవరాశులకు, ఈ విశ్వం మొత్తానికి ప్రవక్తగా అల్లాహ్ నియమించారని అందులో వివరించారు. మహమ్మద్ ప్రవక్త జన్మించిన కారణంగా.. ఆయన జ్ణాపకార్థం ఈద్-ఎ-మిలాద్-ఉన్ పండుగను (Milad un-Nab) జరుపుకుంటారు.

మహ్మద్ ప్రవక్త పుట్టిన రోజు, అలాగే మరణించిన రోజే ఈద్ మిలాద్-ఉన్-నబి, మానవులందరికీ ప్రేమ, ఐక్యత సందేశాన్ని వ్యాప్తి చేసిన ప్రవక్త

ఆయన సౌదీ అరేబియాలోని మక్కాలో క్రీ. శ. 570లో జన్మించి క్రీ. శ.632 వరకు జీవించి అదే రోజున(తేదీన) కాలధర్మం చేశారు. ముస్లింల చాంద్ర మాన క్యాలండర్ ప్రకారం ఈద్ మిలాద్-ఉన్-నబీ వారి రబీవుల్ అవ్వల్ మాసంలో జరుపుకుంటారు. ముస్లింల విశ్వాసం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ చివరి ప్రవక్త.మిలాద్-ఉన్-నబీ అనే పండుగను మావ్లిద్ అన్-నబీ పండుగ అని కూడా పిలుస్తారు.

మిలాద్ ఉన్ నబీ చరిత్ర ఏమిటి? ఈద్ మిలాద్-ఉన్-నబీ పండుగను ఎందుకు జరుపుకుంటారు, మీలాదె నబి పండుగ గురించి ప్రత్యేక కథనం

ఈ పండుగ రోజున ప్రార్థనలు, ఖురాన్ పఠనం, మసీదుల్లో ప్రసంగాలు వంటివి వారు జరుపుకుంటారు. అయితే ఈ పండుగ విషయంలో ముస్లింలలో రెండు తెగలవారు అంటే, సున్నీలు, షియాలు వేర్వేరు భావాలు కలిగి ఉన్నారు. ఆకుపచ్చని రిబ్బన్లు, జెండాలు, బ్యానర్లు వంటివి ఈ రోజున ముస్లింలు ప్రదర్శిస్తారు. మసీదులు, ఇతర కమ్యూనిటీ భవనాల్లో అన్నదానం, రాత్రుల్లో సైతం మసీదుల్లో ప్రార్థనలు జరుపుతారు. ముస్లింలలోని చాలా తెగలవారు ప్రవక్త పుట్టిన రోజును ఓ పర్వదినంగా భావించరు. ముస్లింలలోని సలాఫీ, వహబీ సిద్ధాంతాలున్నవారు ఈ రోజును పర్వదినంగా ఆచరించరు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now