Hyderabad: తాళి కట్టిన తరువాత డబ్బు, నగలతో వధువు పరార్, వరుడు నచ్చలేదని అందుకే నా లవర్‌తో లేచిపోతున్నానంటూ అమ్మమ్మకు ఫోన్, ఆందోళనకు దిగిన పెళ్లి కొడుకు తరపు బంధువులు

భాగ్యనగరంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నిఖా పూర్తయిన నిమిషానికే ఓ పెళ్లి కూతురు భర్త ఇచ్చిన మెహర్‌ (కానుకలు)ను తీసుకొని ప్రియుడితో కలిసి పరారైన సంఘటన (Bride runs away with lover) బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కలకలం రేపింది.

Representational Image (Photo Credits: Pexels)

Hyd, Sep 19: భాగ్యనగరంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నిఖా పూర్తయిన నిమిషానికే ఓ పెళ్లి కూతురు భర్త ఇచ్చిన మెహర్‌ (కానుకలు)ను తీసుకొని ప్రియుడితో కలిసి పరారైన సంఘటన (Bride runs away with lover) బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కలకలం రేపింది. వివరాల్లోకెళితే.. బెంగుళూర్‌కు చెందిన 28 ఏళ్ల యువకుడికి మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వట్టెపల్లిలో నివాసం ఉండే యువతితో ఈ నెల 16న పెద్దల సమక్షంలో వివాహ నిశ్చయమయ్యింది.

అదేరోజు పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులతో కలిసి వివాహ స్థలమైన బాలాపూర్‌లోని షాహిన్‌నగర్‌కు చేరుకున్నారు. బాగా అలసిపోయామంటూ 17వ తేదీకి నిఖాను వాయిదా వేశారు. 17వ తేదీన ఖాజీ సమక్షంలో నిఖా జరిగాక... ఆనవాయితీ ప్రకారం మెహర్‌ కింద పెళ్లి కుమారుడు తన భార్యకు రూ. 50 వేలతో పాటు రూ. 2 లక్షల విలువైన బంగారు ఆభరణాలు అందజేశారు. అనంతరం జరగాల్సిన కార్యానికి ముస్తాబయ్యేందుకు బ్యూటీ పార్లర్‌కు వెళ్లొస్తానంటూ పెళ్లి కుమార్తె బయటికి వెళ్లింది. గంట.. రెండు గంటలవుతున్నా ఆమె రాలేదు. దీంతో పెళ్లి కొడుకు ప్రశ్నించడంతో పెళ్లికుమార్తె తల్లి విషయం బయటపెట్టింది. వధువు తన అమ్మమ్మకు ఫోన్ చేసి భర్త తనకు నచ్చలేదని, కాబట్టి ప్రియుడితో వెళ్లిపోతున్నానని (after few minutes of marriage) చెప్పి ఫోన్ స్విచ్ఛాప్ చేసింది.

తాగుడుకు బానిసైన భార్య, మానకపోవడంతో ఆమెను గొడ్డలితో నరికి చంపేసిన భర్త, మ‌హారాష్ట్ర‌లోని పాల్ఘ‌ర్ జిల్లాలో దారుణ ఘటన, ముంబైలో మందు పోయలేదని ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన మరో ఇద్దరు వ్యక్తులు

తన కుమార్తె తమకే తెలియకుండా తన ప్రియుడితో కలిసి వెళ్లిందని వెల్లడించింది. దీంతో పెళ్లి కొడుకు తరఫు వారు ఆందోళనకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామనడంతో చివరకు వధువు ఇంటి వారు మెహర్‌ కింద అందించిన సొమ్మును అప్పగిస్తామని వేడుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. తనకు ఇవ్వాల్సిన కట్నం ఇవ్వలేదంటూ చివరకు ఖాజీ కూడా ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తం మీద ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందనందున కేసు నమోదు చేయలేదని బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.భాస్కర్‌ తెలిపారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Actress Jayaprada's Brother Passed Away: సీనియర్ నటి జయప్రద ఇంట్లో విషాదం.. సోదరుడు రాజబాబు కన్నుమూత

Bride Father Died: కుమార్తె పెళ్లి జరుగుతుండగా గుండెపోటుతో తండ్రి మృతి.. పెండ్లి ఆగిపోవద్దన్న ఉద్దేశంతో తండ్రి మరణవార్త చెప్పకుండానే కొండంత దుఃఖంతోనే వివాహ క్రతువును పూర్తి చేయించిన బంధువులు.. కామారెడ్డిలో విషాద ఘటన

Satwiksairaj’s Father Passes Away: బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్ కు పితృవియోగం.. గుండెపోటుతో తండ్రి హఠాన్మరణం.. అవార్డు అందుకోవడానికి వెళ్తుండగా ఊహించని ఉపద్రవం.. అసలేం జరిగింది?

Gurgaon Shocker:ఘోరం.. నైట్ డ్యూటీకి వెళుతూ కూతురిని మేనమామ ఇంట్లో వదిలి వెళ్ళిన తల్లిదండ్రులు, దారుణంగా అత్యాచారం చేసిన మేనమామ స్నేహితుడు

Advertisement
Advertisement
Share Now
Advertisement