Karnataka Ghost Marriage: 30 ఏండ్ల కిందట మరణించిన మా కుమార్తెకు ప్రేతాత్మ వరుడు కావలెను.. కర్ణాటకకు చెందిన ఓ తల్లిదండ్రుల పత్రికా ప్రకటన.. ఎందుకంటే?

ఇటీవల వచ్చిన ఓ సినిమాలో హీరో దెయ్యాన్ని వివాహం చేసుకోవడం చూసి ఆశ్చర్యం వేసింది కదూ.. కర్ణాటకలోని పుత్తూరులో ఓ కుటుంబ పెద్దలు ఇచ్చిన పత్రికా ప్రకటన దానికి మించేలా ఉంది.

Marriage (Credits: Pixabay)

Bengaluru, May 14: ఇటీవల వచ్చిన ఓ సినిమాలో హీరో దెయ్యాన్ని (Ghost) వివాహం (Marriage) చేసుకోవడం చూసి ఆశ్చర్యం వేసింది కదూ.. కర్ణాటకలోని పుత్తూరులో ఓ కుటుంబ పెద్దలు ఇచ్చిన పత్రికా ప్రకటన దానికి మించేలా ఉంది. 30 ఏండ్ల క్రితం మరణించిన తమ కుమార్తెకు తగిన ప్రేతాత్మ వరుడు కావాలని ఈ ప్రకటనలో మరణించిన ఆమె తల్లిదండ్రులు కోరారు. “కులల్‌ కులం, బంగే రా గోత్రంలో జన్మించిన వధువుకు తగిన వరుడు కావలెను. వధువు 30 ఏండ్ల క్రితం మరణించింది” అని ఈ ప్రకటనలో వాళ్లు తెలిపారు. ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు.

ఏపీవాసుల ఓటు చైతన్యం.. అర్ధరాత్రి 12 గంటల వరకు 78.36 శాతం పోలింగ్ నమోదు.. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అత్యధికంగా 83.19 శాతం పోలింగ్.. 63.19 శాతంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో అతి తక్కువగా పోలింగ్ నమోదు.. ఈసీ అధికారిక గణాంకాలు విడుదల

టోల్ గేట్ వద్ద డబ్బులు అడిగినందుకు.. కారుతో మహిళను ఢీ కొట్టాడు.. యూపీలో ఘోరం (వైరల్)

ఆ ప్రకటన వెనుక ఉన్నదేంటంటే?

దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లోని తులునాడు ప్రాంతంలో మరణించినవారి ఆత్మలకు వివాహం చేసే ఆచారం ఉంది. జీవించి ఉన్నవారికి పెండ్లి చేసినట్లుగానే ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే సదరు ప్రకటన వెలువడినట్లు తెలుస్తుంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement