Andhra Pradesh Elections 2024: ఏపీవాసుల ఓటు చైతన్యం.. అర్ధరాత్రి 12 గంటల వరకు 78.36 శాతం పోలింగ్ నమోదు.. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అత్యధికంగా 83.19 శాతం పోలింగ్.. 63.19 శాతంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో అతి తక్కువగా పోలింగ్ నమోదు.. ఈసీ అధికారిక గణాంకాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ లో సోమవారం జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఏపీవాసులు ఆసక్తి కనబర్చారు. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగింది.
Vijayawada, May 14: ఆంధ్రప్రదేశ్ లో (Andhrapradesh) సోమవారం జరిగిన అసెంబ్లీ (Assembly), లోక్ సభ ఎన్నికల్లో (Loksabha Elections) ఓటు వేయడానికి ఏపీవాసులు ఆసక్తి కనబర్చారు. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగింది. అన్ని చోట్లా పోలింగ్ ముగింపు సమయానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 78.36 శాతంగా నమోదయింది. చెదురుమదురు హింసాత్మక ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 83.19 శాతం పోలింగ్ నమోదయింది. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 63.19 శాతం నమోదయింది. ఈ మేరకు అర్ధరాత్రి 12 గంటల వరకు అందిన డేటాను అధికారిక యాప్ లో ఎన్నికల సంఘం అప్ డేట్ చేసింది.
జిల్లాలవారీగా ఓటింగ్ శాతాలు ఇలా ఉన్నాయి..
- అల్లూరి సీతారామరాజు - 63.19 శాతం
- అనకాపల్లి - 81.63 శాతం
- అనంతపురం - 79.25 శాతం
- అన్నమయ్య - 76.12 శాతం
- బాపట్ల - 82.33 శాతం
- చిత్తూరు - 82.65 శాతం
- అంబేద్కర్ కోనసీమ - 83.19 శాతం
- తూర్పు గోదావరి - 79.31 శాతం
- ఏలూరు - 83.04 శాతం
- గుంటూరు - 75.74 శాతం
- కాకినాడ - 76.37 శాతం
- కృష్ణా - 82.20 శాతం
- కర్నూలు - 75.83 శాతం
- నంద్యాల - 80.92 శాతం
- ఎన్టీఆర్ - 78.76 శాతం
- పల్నాడు -78.70 శాతం
- పార్వతీపురం మన్యం - 75.24 శాతం
- ప్రకాశం - 82.40 శాతం
- పొట్టిశ్రీరాములు నెల్లూరు - 78.10 శాతం
- శ్రీ సత్యసాయి - 82.77 శాతం
- శ్రీకాకుళం - 75.41 శాతం
- తిరుపతి - 76.83 శాతం
- విశాఖపట్నం - 65.50 శాతం
- పశ్చిమ గోదావరి -81.12 శాతం
- వైఎస్సార్ - 78.12 శాతం
(The above story first appeared on LatestLY on May 14, 2024 08:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

