James Anderson Retires: నా బెస్ట్ బ్యాటర్ సచిన్, చెత్త బంతులు వేస్తే బౌండరీ లైన్ అవతలే, జేమ్స్ అండర్సన్ కీలక వ్యాఖ్యలు
వెస్టిండీస్‌తో తొలి టెస్టు ద్వారా తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలుకబోతున్న అండర్సన్ తన అనుభవాలను పంచుకున్నాడు. ‘నేను చూసిన అత్యుత్తమ బ్యాటర్లలో సచిన్ టెండ్కూలర్.
ఇంగ్లండ్ ప్లేయర్ జేమ్స్ అండర్సన్ తన 22 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్ కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికాడు. వెస్టిండీస్‌తో ఇవాళ (జులై 12) ముగిసిన టెస్ట్ మ్యాచ్ ఆండర్సన్ కెరీర్‌లో చివరిది. తన చివరి మ్యాచ్‌ను జిమ్మీ గెలుపుతో ముగించాడు. ఈ మ్యాచ్‌లో అతను నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అనంతరం గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు.
తన బౌలింగ్ ఎదుర్కొన్న వారిలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అత్యుత్తమ బ్యాటర్ అంటూ ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో తొలి టెస్టు ద్వారా తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలుకబోతున్న అండర్సన్ తన అనుభవాలను పంచుకున్నాడు. ‘నేను చూసిన అత్యుత్తమ బ్యాటర్లలో సచిన్ టెండ్కూలర్. క్రికెట్ చరిత్రలో ముగిసిన యోధుడి ప్రస్థానం, టెస్ట్ కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికిన జేమ్స్ అండర్సన్, ఎమోషనల్ అయిన ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్
అతన్ని ఔట్ చేసేందుకు ఎప్పుడు ప్రత్యేక ప్రణాళికలు ఎంచుకోలేదు. కానీ చెత్త బంతులు వేస్తే కచ్చితంగా సచిన్ నుంచి ధీటైన సమాధానం వస్తుంది. అతను భారత్‌కు ఎంతో కీలకమైన ప్లేయర్. భారత్‌లో సచిన్‌ను ఔట్ చేస్తే అప్పుడు మైదానంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది.అతనిది ఎంతో కీలకమైన వికెట్’ అని అన్నాడు.