Jammu and Kashmir Horror: పెళ్లి చేసుకోను పో అన్న యువతి, కోపంతో ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి పాతిపెట్టిన యువకుడు, జమ్మూలో దారుణ ఘటన

దేశ రాజధాని ఢిల్లీలో అఫ్తాబ్‌ పూనావాలా అనే యువకుడు తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాకర్‌ అనే యువతిని చంపి, 35 ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పడేసిన దారుణం గుర్తు ఉండి ఉంటుంది. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని బుద్గా జిల్లాలో అలాంటి ఘటనే (Budgam Man kills Woman) చోటుచేసుకుంది.

Stabbed (file image)

Jammu, Mar 13: దేశ రాజధాని ఢిల్లీలో అఫ్తాబ్‌ పూనావాలా అనే యువకుడు తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాకర్‌ అనే యువతిని చంపి, 35 ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పడేసిన దారుణం గుర్తు ఉండి ఉంటుంది. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని బుద్గా జిల్లాలో అలాంటి ఘటనే (Budgam Man kills Woman) చోటుచేసుకుంది. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే (rejecting marriage proposal) కోపంతో షబీర్‌ అహ్మద్‌ వనీ(45) అనే వ్యక్తి కార్పెంటర్‌ ఓ మహిళ(30)ను చంపేశాడు.

అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి (chops body into pieces) వేర్వేరు చోట్ల పాతిపెట్టాడు. మార్చి 7వ తేదీన కోచింగ్‌ క్లాస్‌కని వెళ్లిన తన సోదరి కనిపించకుండా పోయిందంటూ షోయిబుగ్‌కు చెందిన తన్వీర్‌ అహ్మద్‌ ఖాన్‌ అనే వ్యక్తి 8న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సదరు మహిళ సెల్‌ కాల్‌ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మొహన్‌పురా ఒంపొరాకు చెందిన వనీని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించాడు. అతడిచ్చిన సమాచారంతో పాతిపెట్టిన మహిళ శరీర భాగాలను శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు.

ఆర్థిక ఇబ్బందులా లేక వ్యక్తితగ కారణాలా, ఆర్టీసీ బస్సులోనే కండక్టర్ ఆత్మహత్య, తెలంగాణలో విషాదకర ఘటన

కొన్ని రోజుల క్రితం పెళ్లి చేసుకుంటానంటూ యువకుడు చేసిన ప్రతిపాదనను తిరస్కరించడంతో ఆమెపై పగబట్టినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement