Succumbed Due to Pneumonia: కృష్ణంరాజు మృతికి కారణమిదే.. వెల్లడించిన ఆసుపత్రి వర్గాలు

మధుమేహం, పోస్ట్ కొవిడ్, కార్డియాక్ అరెస్ట్‌ తో కృష్ణంరాజు కన్నుమూశారన్న ఆసుపత్రి వర్గాలు.. గత నెల 5న ఆసుపత్రిలో చేరిన కృష్ణంరాజు.. అప్పటి నుంచి వెంటిలేటర్ పైనే చికిత్స అందించామన్న వైద్యులు.. నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి చేరుకోనున్న కృష్ణంరాజు పార్థివదేహం.. రేపు అంత్యక్రియలు

Hyderabad, September 11: అనారోగ్యంతో బాధపడుతూ ఈ తెల్లవారుజామున కన్నమూసిన ప్రముఖ నటుడు కృష్ణం రాజు మృతికి గల కారణాలను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మధుమేహం, పోస్ట్ కొవిడ్, తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్‌తో ఆయన కన్నుమూసినట్టు పేర్కొన్నాయి. గుండె కొట్టుకునే వేగం విషయంలో చాలా కాలంగా ఆయన సమస్య ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. రక్తప్రసరణ సరిగా లేకపోవడంతో గతేడాది ఆయన కాలికి శస్త్రచికిత్స కూడా జరిగినట్టు పేర్కొన్నారు. అలాగే, దీర్ఘకాలంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని, గత నెల 5న పోస్టు కొవిడ్ సమస్యలో ఆసుపత్రిలో చేరారని వివరించారు.

ఓటమితో మొదలై కేంద్రమంత్రి వరకు ఎదిగిన రెబల్‌ స్టార్, ఇంట్రెస్టింగ్‌గా సాగిన కృష్ణంరాజు పొలిటికల్ జర్నీ, నరసాపురం నుంచి రాజకీయ ప్రస్థానం, కేంద్రంలో కీలక శాఖలు నిర్వహించిన దిట్ట

కిడ్నీలు పూర్తిగా పాడైపోవడంతో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచే వెంటిలేటర్‌పై ఉంచినట్టు చెప్పారు. ఈ తెల్లవారుజామున 3.16 గంటలకు తీవ్రమైన గుండెపోట రావడంతో ఆయన కన్నుమూశారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కృష్ణంరాజు పార్థివదేహాన్ని నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి తీసుకొస్తారు. ఆ తర్వాత ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం అందుబాటులో ఉంచుతారు. రేపు అంత్యక్రియలు జరుగుతాయి.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

IT Employees Suffer Overweight: హైదరాబాద్ భారతదేశానికి మధుమేహ రాజధానిగా మారుతోంది, AIG హాస్పిటల్ ఛైర్మెన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, వీడియో ఇదిగో

SC Dismisses Jagan's Bail Cancellation Petition: జగన్‌ బెయిల్‌ రద్దుకు కారణాలేవీ లేవు, రఘురామ పిటిషన్ డిస్మిస్‌ చేస్తున్నట్లు ఆదేశాలిచ్చిన సుప్రీంకోర్టు, ఈ కేసును కేసును తెలంగాణ హైకోర్టు విచారిస్తోందని వెల్లడి

Dil Rau On IT Raids: ఐటీ సోదాలు సర్వసాధారణమే..అవాస్తవాలను ప్రచారం చేయొద్దు అని దిల్ రాజు విజ్ఞప్తి, ఫిబ్రవరి 3న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారని వెల్లడి

IT Raids In Dil Raju House Over: నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ముగిసిన ఐటీ సోదాలు.. గత నాలుగు రోజులుగా కొనసాగిన దాడులు

Advertisement
Advertisement
Share Now
Advertisement