FDC Chairman, producer Dil Raju on IT Raids

Hyd, Jan 25:  ఐటీ సోదాలపై స్పందించారు నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజు(Dil Raju). వ్యాపారాలు చేస్తున్నప్పుడు తనిఖీలు సర్వసాధారణం అన్నారు. సినీ నిర్మాణంలో ఉన్నందున అన్నీ తనిఖీ చేస్తారు అన్నారు.మా లావాదేవీలన్నీ క్లియర్‌గా ఉన్నాయి.. డబ్బులు, డాక్యుమెంట్లు ఏవీ స్వాధీనం చేసుకోలేదు అన్నారు.

అకౌంట్స్‌ తనిఖీ చేసి స్టేట్‌మెంట్స్‌ తీసుకున్నారు..ఐటీ రెయిడ్స్‌(IT Raids) జరిగినప్పుడు రూ.20లక్షలలోపే ఉందన్నారు. తనిఖీల తర్వాత ఐటీ అధికారులే ఆశ్చర్యపోయారు అన్నారు. ఫిబ్రవరి 3న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు అన్నారు ఎఫ్‌డీసీ(FDC) చైర్మన్‌ దిల్‌ రాజు. దాడులు జరుగుతున్న సమయంలో ఎవరినీ బయటకు వెళ్లనివ్వలేదని ఆయన వివరించారు.  నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ముగిసిన ఐటీ సోదాలు.. గత నాలుగు రోజులుగా కొనసాగిన దాడులు 

అలాగే తన తల్లికి గుండెపోటు వచ్చినట్లు మీడియాలో వచ్చిన పుకార్లను ఖండించారు దిల్ రాజు. తన తల్లి వయసు 81 ఏళ్ల అని, ఈ నెల 19న ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ కారణంగా అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు.

దిల్ రాజు నివాసం, ఆఫీసులపై ఐటీ అధికారులు నాలుగు రోజుల పాటు సోదాలు చేసిన సంగతి తెలిసిందే.