Hyderabad, Jan 25: ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజుకు (Dil Raju) చెందిన హైదరాబాద్ లోని ఇల్లు, ఆఫీసుల్లో మంగళవారం తెల్లవారుజామున మొదలైన ఐటీ దాడులు (IT Raids) ఎట్టకేలకు ముగిశాయి. మంగళవారం ఉదయమే 8 చోట్ల ఏక కాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు 55 బృందాలుగా విడిపోయి దిల్ రాజు ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో మంగళవారం మొదలైన ఈ తనిఖీలు శనివారం వేకువజామున వరకు కొనసాగాయి. ఆదాయం, చెల్లింపుల్లో కొన్ని తేడాలను గుర్తించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి.. మరో ఇద్దరికి గాయాలు
Here's Video:
సినీ ప్రముఖుల ఇళ్లలో ముగిసిన ఐటీ సోదాలు
ఇవాళ తెల్లవారుజాము వరకు కొనసాగిన అధికారుల తనిఖీలు
పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు
నాలుగు రోజుల పాటు కొనసాగిన సోదాలు https://t.co/LDGpicSDZt
— BIG TV Breaking News (@bigtvtelugu) January 25, 2025
వీళ్ల ఇండ్లల్లో కూడా
దిల్ రాజు ఇంటితో పాటు ఆయన సోదరుడు శిరీష్, కూతురు హన్సిత రెడ్డి నివాసాలపై, మైత్రీ మూవీస్ కార్యాలయం, డైరెక్టర్ సుకుమార్, మాంగో మీడియా ఆఫీసుల్లో కూడా ఐటీ అధికారులు దాడులు జరిపారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
కేసీఆర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఆయన సోదరి చీటి సకలమ్మ కన్నుమూత.. నేడు అంత్యక్రియలు
‘దిల్ రాజు’ కాంపౌండ్ మూవీలే
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందించిన గేమ్ చేంజర్, వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీలు ఇటీవల విడుదల అవ్వడం, అవి రెండూ దిల్ రాజు కాంపౌండ్ మూవీలే కావడం తెలిసిందే.