Kurchi Thata in Police Custody: ‘గుంటూరు కారం’ కుర్చీ మడతపెట్టి.. పాటకు ప్రేరణగా నిలిచిన ‘కుర్చీ తాత’ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ తర్వాత కౌన్సెలింగ్.. అసలేం జరిగిందంటే?

హీరో మహేష్ బాబు తాజా చిత్రం ‘గుంటూరు కారం’లోని కుర్చీ మడతపెట్టి పాటకు ప్రేరణగా నిలిచిన ‘కుర్చీ తాత’ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Kurchi Thata (Credits: X)

Hyderabad, Jan 27: హీరో మహేష్ బాబు (Maheshbabu) తాజా చిత్రం ‘గుంటూరు కారం’లోని (Gunturu Karam) కుర్చీ మడతపెట్టి పాటకు ప్రేరణగా నిలిచిన ‘కుర్చీ తాత’ను (Kurchi Thata in Police Custody) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుర్చీ మడత పెడ్తానంటూ ఫేమస్‌ అయిన కుర్చీ తాత అలియాస్‌ కాలా పాషాను యూసుఫ్‌ గూడ కృష్ణకాంత్‌ పార్క్‌ వద్ద మధురానగర్‌ ఎస్సై ఇక్బాల్‌ అదుపులోకి తీసుకున్నారు.

Secunderabad Girls Hostel: బాత్రూం నుంచి గర్ల్స్ పీజీ హాస్టల్‌ లోకి రాత్రిపూట చొరబడిన దుండగులు.. ఒకడిని పట్టుకుని చున్నీతో చేతులు కట్టేసిన అమ్మాయిలు.. సికింద్రాబాద్ లో కలకలంరేపిన ఈ ఘటనలో తర్వాత ఏమైంది?? (వీడియోతో)

కారణం ఇదే

ఎస్సై ఇక్బాల్‌ కథనం ప్రకారం.. కుర్చీ తాత అలియాస్‌ కాలా పాషా సోషల్‌ మీడియాలో పరుష పదజాలంతో దూషిస్తూ వీడియోలు పోస్ట్‌ చేస్తున్నాడంటూ యాదగిరి నగర్‌ లో నివాసముండే ఓ యూట్యూబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కాలా పాషాను అదుపులోకి తీసుకుని స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మద్యం మత్తులో అలా మాట్లాడానని కుర్చీ తాత తన తప్పును అంగీకరించడంతో కేసు రాజీ కుదిరినట్టు ఎస్సై తెలిపారు. అనంతరం తాతను విడిచిపెట్టారు.

ICJ On Gaza Attacks: గాజాలో నరమేధం ఆపేయండి.. ఇజ్రాయెల్‌ ను ఆదేశించిన అంతర్జాతీయ కోర్టు.. పట్టించుకోమన్న ఇజ్రాయెల్‌

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement