Maharashtra: ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 400 మంది 6 నెలల పాటు మైనర్ బాలికపై అత్యాచారం, నిందితుల్లో ఒక పోలీసు..

తనపై ఆరు నెలలుగా సుమారు 400 మందికి అత్యాచారానికి పాల్పడ్డారని, అందులో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నాడని చెప్పడంతో పోలీసులు షాకయ్యారు.

Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

మహారాష్ట్రలోని బీడ్‌లో అమానవీయమైన ఘటన వెలుగు చూసింది. అక్కడ గత కొన్ని నెలలుగా మైనర్‌పై అత్యాచారం జరుగుతున్న ఘటన బయటి ప్రపంచానికి తెలిసింది. ఒకరు, ఇద్దరు, ముగ్గురు కాదు ఏకంగా 400 మంది మృగాళ్లు ఒక బాలికపై వరుసగా 6 నెలల పాటు అత్యాచారం చేసిన విషయం బయటకు రావడంతో పోలీసుల మతిచెదిరిపోయింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు. అభం శుభం తెలియని ఓ యువతిపై ఏకంగా 400 మంది లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆరు నెలలుగా ఆమెపై ఏకంగా 400 మంది అత్యాచారానికి ఒడిగట్టడంతో ఆ యువతి గర్భం దాల్చింది. నిందితుల్లో ఓ పోలీసు కూడా ఉన్నాడు.

ఈ మొత్తం విషయాన్ని బీడ్ జిల్లా ఎస్పీ రాజా రామస్వామి తెలియజేస్తూ.. ఈ మైనర్ బాలికపై 400 మంది అత్యాచారం చేసిన కేసు నమోదైంది. ఇదంతా గత 6 నెలలుగా జరుగుతోందని రామస్వామి చెప్పారు. ఇందులో పోలీసులు కూడా పాల్గొన్నారు. ఈ మైనర్‌తో ఈ అకృత్యం ఎవరు చేశారనే దానిపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.

బాధితురాలు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్‌తో మాట్లాడుతూ.. ‘‘నాపై చాలా మంది అసభ్యంగా ప్రవర్తించారు. నేను ఫిర్యాదు చేయడానికి అంబజోగై పోలీస్ స్టేషన్‌కు చాలాసార్లు వెళ్లాను, కాని పోలీసులు పట్టించుకోలేదని. బాధ్యులపై చర్యలు తీసుకోలేదని తెలిపింది. అంతే కాదు ఓ పోలీసు ఉద్యోగి కూడా తనను వేధించినట్లు తెలిపింది.

ఇక బాధితురాలి వివరాల్లోక వెళితే బీడ్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతి తల్లి రెండేళ్ల క్రితం చనిపోయింది. ఆ తరువాత కొన్నాళ్లకు తండ్రి ఆమెను ఓ వ్యక్తికిచ్చి పెళ్లి చేశాడు. ఐతే తన సొంత మామ లైంగికంగా వేధిస్తుండటంతో భరించలేని ఆ యువతి ఏడాది తర్వాత పుట్టింటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. ఆరు నెలల క్రితం ఏదైనా ఉద్యోగం చేసుకుందామని అంబేజోగై పట్టణానికి వెళ్లిందా యువతి. అక్కడ ఉద్యోగం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పిన ఇద్దరు వ్యక్తులు ఆమెను ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెపై ఆ తరువాత చాలా మంది లైంగిక దాడికి పాల్పడ్డారు.

ప్రస్తుతం రెండు నెలల గర్భవతిగా ఉన్న యువతి పోలీసులను ఆశ్రయించి జరిగిన దారుణం చెప్పుకుంది. తనపై ఆరు నెలలుగా సుమారు 400 మందికి అత్యాచారానికి పాల్పడ్డారని, అందులో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నాడని చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు నలుగురిని ఆరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలింపు చేపట్టారు.

అయితే, ఇప్పుడు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకు పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ మైనర్‌కు కూడా వివాహమైంది. బాధితురాలు రెండు నెలల గర్భిణి. అతని వాంగ్మూలం ఆధారంగా బాల్య వివాహాల చట్టం, అత్యాచారం, వేధింపులు, పోస్కో కింద కేసు నమోదు చేశారు. పోలీసులు మొత్తం కేసును విచారిస్తున్నారు.