Blue Whale: కేరళ తీరానికి కొట్టుకొచ్చిన 50 అడుగుల తిమింగలం కళేబరం.. చూసేందుకు ఎగబడుతున్న జనం.. పేలిపోయే ప్రమాదం ఉందని దగ్గరికి వెళ్లొద్దంటూ అధికారుల హెచ్చరికలు.. వీడియోతో

కేరళలోని కోజికోడ్ బీచ్‌ కు కొట్టుకొచ్చిన ఓ బ్లూ వేల్ (నీలి తిమింగలం) కళేబరాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. దాని పొడవు 15 మీటర్లు (దాదాపు 50 అడుగులు) ఉంది.

Blue Whale (Credits: Instagram)

Newdelhi, Oct 3: కేరళలోని (Kerala) కోజికోడ్ బీచ్‌ కు కొట్టుకొచ్చిన ఓ బ్లూ వేల్ (నీలి తిమింగలం) (Blue Whale) కళేబరాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. దాని పొడవు 15 మీటర్లు (దాదాపు 50 అడుగులు) ఉంది. స్థానిక జాలర్ల ద్వారా సమాచారం అందుకున్నఆరోగ్యాధికారి ప్రమోద్ వెంటనే బీచ్‌ కు చేరుకుని తిమింగలం కళేబరాన్నిపరిశీలించారు. దాని మరణానికి కారణం తెలుసుకునేందుకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రొటోకాల్ ప్రకారం దానిని అక్కడే పెద్దగొయ్యి పాతిపెడతామని చెప్పారు.

Times Now-ETG Survey: టైమ్స్‌ నౌ తాజా సర్వే ఫలితాలు ఇవిగో, ఏపీలో మళ్లీ జగన్ సర్కారే, తెలంగాణలో కారు జోరు, కేంద్రంలో మళ్లీ ఎన్టీయే ప్రభంజనం అంటున్న సర్వే..

 

View this post on Instagram

 

A post shared by Wayanadan (210K+ family❤️) (@wayanadan)

దయచేసి ఎవరూ ఆ కళేబరం వద్దకు వెళ్లొద్దని, అది పేలిపోయి గాయాలపాలయ్యే అవకాశం ఉందని ఓ ఇన్ స్టా యూజర్ హెచ్చరించారు. సాధారణంగా పెద్ద తిమింగలాల కళేబరాల్లో వాయువులు ఏర్పడి ఒక్కోసారి పేలిపోతుంటాయి అని నిపుణులు చెబుతున్నారు.

వీడియో ఇదిగో, నువ్వు ఎవరెవరి దగ్గర పడుకున్నావో తెలుసంటూ మంత్రి రోజాపై దారుణంగా కామెంట్లు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే, అరెస్ట్ చేసిన గుంటూరు పోలీసులు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement