Mysuru Shocker: కుక్కపై అత్యాచారానికి తెగబడిన కామాంధుడు, మైసూరులో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొందరు యువకులు, నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులు
కామాంధులు చివరకు జంతువులను కూడా వదలడం లేదు. కర్ణాటక రాష్ట్రంలో మైసూరులో ఓ కామాంధుడు కుక్కపై అత్యాచారానికి పాల్పడ్డాడు. భ్యసమాజం తలదించుకునే అమానుషంగా ఈ దాడికి పాల్పడ్డాడు. ఆ యువకుడు వీధి కుక్కపైన లైంగిక దాడికి (Man rapes dog in Mysuru) పాల్పడగా కొందరు వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది.
Mysuru, Feb 17: కర్ణాటక రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కామాంధులు చివరకు జంతువులను కూడా వదలడం లేదు. కర్ణాటక రాష్ట్రంలో మైసూరులో ఓ కామాంధుడు కుక్కపై అత్యాచారానికి పాల్పడ్డాడు. భ్యసమాజం తలదించుకునే అమానుషంగా ఈ దాడికి పాల్పడ్డాడు. ఆ యువకుడు వీధి కుక్కపైన లైంగిక దాడికి (Man rapes dog in Mysuru) పాల్పడగా కొందరు వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది.
మైసూర్‌లోని గోకులం 3వ స్టేజ్‌లో నివసించే సోమశేఖర్ (26) ఈ నెల 11న రాత్రి సమయంలో సందులో చాటుగా వీధి కుక్కపైన లైంగిక దాడికి పాల్పడుతుండగా, కొందరు యువకుల వీడియో తీసి సోషల్ మీడియాలో వ్యాప్తి చేశారు. పీపుల్ ఫర్ అనిమల్స్ (పీఎఫ్‌ఎ) అనే స్వచ్ఛంద సంస్థ వీవీపురం పోలీసులకు (VV Puram police station) ఫిర్యాదు చేసింది. జంతువులపై లైంగికదాడి జరిపాడన్న అభియోగాలతో కేసు నమోదు చేసి నిందితున్ని సోమవారం అరెస్టు చేశారు. కుక్కను గుర్తించి వైద్య పరీక్షలు చేయిస్తామని తెలిపారు.
అయితే ఇది తొలి ఘటన కాదని ఇలాంటి ఘటనలు దేశంలో ఎన్నో జరుగుతున్నాయని పీపుల్ ఫర్ అనిమల్స్ సంస్థ సీరియస్ అయింది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని యానిమల్ వెల్ఫేర్ ఆఫీసర్, పీపుల్ ఫర్ యానిమల్స్ (పిఎఫ్‌ఎ), కెబి హరీష్ (animal welfare officer) డిమాండ్ చేశారు. మైసూరు మెడికల్‌లో సైకియాట్రీ విభాగం ప్రొఫెసర్ మరియు హెడ్ బీఎన్ రీవిష్ ఈ ఘటనపై మాట్లాడుతూ.. మనుషులు సెక్స్ విషయంలో చాలా ఢిపరెంట్ ఆలోచనలతో ఉంటారని..వారు అసహజ సెక్స్ వైపు ఎక్కువగా ఆసక్తి కనపరుస్తారని తెలిపారు. ఈ ధోరణి మారాలని అప్పుడే సమాజంలో ఇటువంటివి తగ్గుతాయని తెలిపారు.