Bihar Horror: నర్సును గ్యాంగ్ రేప్ చెయ్యడానికి వైద్యుడు సహా మరికొందరి యత్నం.. తనను తాను కాపాడుకోవడానికి వైద్యుడి జననాంగాలు కోసిపారేసిన నర్సు.. బీహార్‌ లో ఘటన

అతని జననాంగాలను కోసిపారేసి తగిన బుద్ధి చెప్పింది ఆ ధీరవనిత.

Rape (Rep Image)

Newdelhi, Sep 13: తనపై అత్యాచార యత్నానికి (Gang Rape) ప్రయత్నించిన ఓ వైద్యుడిపై (Doctor) శివంగిలా ఎదురు తిరిగింది ఓ నర్సు. అతని జననాంగాలను కోసిపారేసి తగిన బుద్ధి చెప్పింది ఆ ధీరవనిత. బీహార్‌ లోని సమస్తిపూర్ జిల్లాలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఆర్‌బీసీ హెల్త్ కేర్ సెంటర్‌ లో పనిచేస్తున్న ఓ నర్సు బుధవారం రాత్రి విధులు నిర్వహిస్తున్నారు. అయితే, ఆమె ఒంటరిగా ఉండటాన్ని గమనించిన అదే దవాఖానకు చెందిన వైద్యుడు, ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ సంజయ్ కుమార్, మరో ఇద్దరు సహాయకులతో కలిసి ఆమెపై లైంగికదాడికి యత్నించాడు. అయితే, ప్రమాదాన్ని ముందే కనిపెట్టిన నర్సు వారి నుంచి తప్పించుకునే క్రమంలో చాకచక్యంగా వ్యవహరించింది.

టాలీవుడ్ లో విషాదం.. ‘ముద్దబంతి నవ్వులో మూగబాసలు..’ వంటి హిట్‌ సాంగ్స్ అందించిన పాటల రచయిత గురు చరణ్‌ ఇకలేరు

బ్లేడుతో దాడి

అప్పటికే మద్యం మత్తులో తూగుతున్న వైద్యుడి జననాంగాలను పదునైన బ్లేడ్‌ తో కోసిపారేసింది. మిగతా వారి నుంచి ఎలాగోలా తప్పించుకుని పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. ఆ వెంటనే పోలీసులు ఆసుప్రతికి చేరుకున్నారు. గాయపడిన  వైద్యుడిని అదుపులోకి తీసుకొని దవాఖానకు తరలించారు. ఇతర నిందితులను అరెస్ట్ చేశారు.

వెండితెర‌పై హిట్ కొట్టిన చిన్న సినిమా ఓటీటీలోకి వ‌చ్చేసింది! నిహారిక కొణిదెల నిర్మించిన క‌మిటీ కుర్రోళ్లు ఎక్కడ చూడొచ్చో తెలుసా? ఈ సినిమా చూస్తే మీ బాల్యం గుర్తుకురాకుండా ఉండ‌దు

ప్రీ-ప్లాన్ గానే

నర్సుపై లైంగికదాడి చేయాలని నిందితులు ప్రీ-ప్లాన్ గానే ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగానే ఆసుపత్రి మెయిన్ గేట్‌ కు లోపలి నుంచి తాళం వేసినట్టు చెప్పారు. ఈ మేరకు సీసీటీవీలు కూడా ఆఫ్ చేశారని వెల్లడించారు.

సోషల్ మీడియాని ఊపేస్తున్న దేవర, ప్రమోషన్స్ బిజీలో జూనియర్ ఎన్‌టీఆర్, ఈ రోజు విడుదల కానున్న ట్రైలర్ 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif