Hyderabad, Sep 13: టాలీవుడ్ (Tollywood) కు చెందిన నిన్నటి తరం ప్రముఖ గీత రచయిత గురుచరణ్ (Gurucharan Passes Away) (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ లో ఆయన తుది శ్వాస విడిచారు. గురుచరణ్ అసలు పేరు మానాపురపు రాజేంద్రప్రసాద్. అలనాటి ప్రముఖనటి ఎం.ఆర్. తిలకం, అప్పటి ప్రముఖ దర్శకుడు మానాపురం అప్పారావుల కుమారుడే గురుచరణ్. ప్రఖ్యాత గేయ రచయిత ఆచార్య ఆత్రేయ దగ్గర కొన్నాళ్లు శిష్యరికం చేసిన గురుచరణ్ ఆ తర్వాత గీత రచన మొదలు పెట్టారు. తెలుగులో రెండు వందలకు పైగా పాటలు రాశారు.
Veteran lyricist #Gurucharan passes away, actor Mohan Babu offers condolences.https://t.co/QxywxW6Yib
— Pinkvilla South (@PinkvillaSouth) September 12, 2024
ఎన్నో అద్భుత గీతాలు
ప్రముఖ నటుడు మోహన్ బాబుతో గురుచరణ్ కు మంచి సాన్నిహిత్యం ఉండేది. ఆయన సినిమాలకు గురుచరణ్ ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. ముఖ్యంగా ‘ముద్దబంతి నవ్వులో మూగబాసలు..’, ‘కుంతీకుమారి తన జోరుజారి’, ‘బోయవాని వేటుకు గాయపడిన కోయిలా..’ పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. గురుచరణ్ మరణం తెలుగు చిత్రపరిశ్రమకు నిజంగా తీరని లోటని మోహన్ బాబు అన్నారు.
సోషల్ మీడియాని ఊపేస్తున్న దేవర, ప్రమోషన్స్ బిజీలో జూనియర్ ఎన్‌టీఆర్, ఈ రోజు విడుదల కానున్న ట్రైలర్